Kamal Haasan: కమల్‌కు తెలుగు హీరో భారీ ఝలక్‌... ఊహించని ట్విస్ట్‌ ఇచ్చాడుగా..!

Kamal Haasan: కమల్‌కు తెలుగు హీరో భారీ ఝలక్‌… ఊహించని ట్విస్ట్‌ ఇచ్చాడుగా..!

Rajeev Rayala

|

Updated on: Mar 27, 2024 | 8:53 PM

అటు పొలిటికల్ షెడ్యూల్ .. ఇటు థగ్స్ లైఫ్ సినిమా షెడ్యూల్ రెండూ.. బ్యాలెన్స్‌ చేయలేక కమల్ తికమకపడడంతో.. ఈ సినిమాలో చేస్తున్న స్టార్ హీరోలు ఒక్కొక్కరిగా పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటికే డేట్స్‌ అడ్జెస్ట్ కాక.. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఈసినిమా నుంచి తప్పుకున్నాడన్నది తెలిసిందే..!



గొడవలతో.. పంచాయితీలతో.. కమల్ భారతీయుడు 2 షూటింగ్ సరిగా సాగలేదనుకుంటే.. ఇప్పుడు థంగ్స్‌ లైఫ్‌ షూటింగ్‌ కూడా.. సరిగా జరగకుండా.. సాగుతోంది. అటు పొలిటికల్ షెడ్యూల్ .. ఇటు థగ్స్ లైఫ్ సినిమా షెడ్యూల్ రెండూ.. బ్యాలెన్స్‌ చేయలేక కమల్ తికమకపడడంతో.. ఈ సినిమాలో చేస్తున్న స్టార్ హీరోలు ఒక్కొక్కరిగా పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటికే డేట్స్‌ అడ్జెస్ట్ కాక.. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఈసినిమా నుంచి తప్పుకున్నాడన్నది తెలిసిందే..! ఇక ఈయన బాటలోనే తెలుగు నేటివ్.. కోలీవుడ్ హీరో జయం రవి కూడా.. కమల్ థగ్స్ లైఫ్ సినిమా నుంచి తప్పుకుంటున్నారట. దీంతో ఈ మూవీ డైరెక్టర్ మణిరత్నం ఈ హీరోకు రీస్లేస్‌గా మరో హీరోను వెతుకులాడే పనిలో ఉన్నారట.