మరో గుడ్ న్యూస్ చెప్పనున్న అక్కినేని ఫ్యామిలీ..

Updated on: Feb 23, 2025 | 9:09 PM

అక్కినేని ఫ్యామిలీ ప్రస్తుతం ఆనందంలో తేలిపోతుంది. ఇటీవలే నాగ చైతన్య వివాహం జరగడంతో అక్కినేని ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరిసింది. నాగ చైతన్య , నటి శోభితను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. అలాగే పెళ్లి తర్వాత నాగచైతన్య తండేల్ సినిమాతో కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ అందుకున్నాడు.  చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన్న తండేల్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో నాగ చైతన్య అద్భుతంగా నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ మరో గుడ్ న్యూస్ పంచుకుందని సోషల్ మీడియాలో , ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఎస్ !మరోసారి అక్కినేని ఇంట పెళ్ళిసందడి మొదలవ్వనుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. నాగచైతన్య పెళ్లి సమయంలోనే అఖిల్ కూడా తన ప్రేయసితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. ఇన్ని రోజులు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న అఖిల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడట. ఇక ఇటీవలే జైనాబ్ రవడ్జీ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్ మెంట్ జరిగింది.హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అక్కినేని అఖిల్ నిశ్చితార్థం విషయాన్నినాగార్జునే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. అఖిల్ , జైనాబ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి నాగార్జున అభిమానులకు ఈ హ్యాపీ న్యూస్ చెప్పారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Monalisa: మోనాలిసా గొప్ప మనసుకు జనం ఫిదా..

ప్రతిరోజూ పెరుగు తీసుకుంటే జరిగేది ఇదే

బంగారం చిన్న దుకాణంలో మంచిదా.. పెద్ద షోరూమ్‌లో బెటరా..?

Allu Arjun: వావ్! హాలీవుడ్‌ మ్యాగజీన్‌పై ఐకాన్ స్టార్

Vishwak Sen: లైలా దెబ్బ ధాటికి.. మారిపోయిన హీరో