Aishwarya Roy - Mahesh Babu: మహేష్‌తో ఐశ్వర్యారాయ్‌..! క్రేజీ అప్డేట్.. గట్టిగానే ప్లాన్ చేస్తున్న డైరెక్టర్..

Aishwarya Roy – Mahesh Babu: మహేష్‌తో ఐశ్వర్యారాయ్‌..! క్రేజీ అప్డేట్.. గట్టిగానే ప్లాన్ చేస్తున్న డైరెక్టర్..

Anil kumar poka

|

Updated on: Feb 06, 2023 | 9:51 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మొదట మహేష్ తో త్రివిక్రమ్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడని అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా కథలో మార్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. మహేష్‌బాబు కెరియర్‌లో 28వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ పొలిటికల్‌ టచ్‌తో కథ నడుస్తుందనే టాక్‌ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే కనిపించనుంది. మరో ముఖ్యమైన పాత్రలో శ్రీలీల అలరించనుంది. తాజా అప్‌డేట్‌ ఏంటంటే.. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం ఐశ్వర్య రాయ్ ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ తన సినిమాల్లోని కీలకమైన పాత్రలని సీనియర్ హీరోయిన్స్ తో చేయిస్తుంటారు. ఈ క్రమంలో మహేష్‌ సినిమాకోసం ఐశ్వర్యారాయ్‌ని రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది.ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ పాత్ర నెగెటివ్ షేడ్స్ ను కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు కావడం వల్లనే ఆమెను ఎంపిక చేసుకున్నట్టుగా సమాచారం. ఆల్రెడీ ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో ఐశ్వర్యరాయ్ నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించింది. సెకండ్ పార్టులో ఆమె విలనిజంపై ఎక్కువ ఫోకస్ ఉండనుంది. మరి మహేశ్ మూవీలో త్రివిక్రమ్ ఆమెను ఎలా చూపిస్తాడో చూడాలి.


మరిన్ని వీడియోస్ కోసం:

Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..