Prudhvi Raj: ట్విట్టర్ ఖాతా తెరిచిన పృథ్వీ! అప్పుడే మళ్లీ రచ్చ షురూ…

Updated on: Feb 23, 2025 | 9:22 PM

టాలీవుడ్ ప్రముఖ పృథ్వీ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆయన వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ చేసిన గొర్రెల కామెంట్స్ ఎంత రచ్చ రాజేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక రాజకీయ పార్టీని ఉద్దేశించే పృథ్వీ కామెంట్స్ చేశాడంటూ ట్విట్టర్ లో ఏకంగా బాయ్ కాట్ లైలా ట్రెండ్ అయ్యింది.

విశ్వక్సేన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. కారణాలేమైనా లైలా మూవీ దారుణంగా ఫెయిల్ అయింది. ఆ తర్వాత పృథ్వీరాజ్ క్షమాపణలు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికి జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. అయితే ఈ వివాదం చల్లబడుతుండగానే మరోసారి వార్తల్లోకి వచ్చాడు పృథ్వీ రాజ్. తాను ట్విట్టర్ ఎక్స్‌లోకి వచ్చేశా అంటూ ట్విట్టర్ అకౌంట్ క్రియోట్ చేసి అందరికి హాయ్ చెప్పాడు ఈ 30 ఇయర్స్ ఇండస్ట్రీ స్టార్. దీంతో అప్పటి నుంచి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. హయ్ .. తాను మీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్‌ని అని ఫస్ట్ ట్వీట్‌లో రాసుకొచ్చిన పృథ్వీ.. ఇది అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ అని.. తన భావాలను స్టేజ్ పైనా ప్రకటిస్తుంటే కొద్ది మంది ఫీల్ అవుతున్నారు కాబట్టి.. ఇక్కడి నుంచి భావ ప్రకటన స్వేచ్చ ని ఉపయోగిస్తాను అంటూ రాసుకొచ్చాడు. అంతేకాదు తన ట్విట్టర్ ఫ్రొఫైల్ కు తన ఫొటోనే పెట్టిన పృథ్వీ.. కవర్ ఫొటోకు మాత్రం మెగా ఫ్యామిలీ ఫొటో ఎంచుకున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఊరికే పనిచేస్తా.. ఉద్యోగం ఇవ్వండి ప్లీజ్‌.. ఓ టెక్కీ ఆవేదన

బర్త్‌డే పార్టీలో కేకుపై క్యాండిల్‌ వెలిగించిన యువతి.. క్షణాల్లో

రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే రూ.10 లక్షలు.. పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌

వీళ్ల కరెంట్ బిల్‌తో.. విల్లా కొనేయొచ్చు !! షాకిస్తున్న హీరోల కరెంట్‌ బిల్

మరో గుడ్ న్యూస్ చెప్పనున్న అక్కినేని ఫ్యామిలీ..