Fathers Day 2021: హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్.. మొదట రెజ్లింగ్‌తో బాగా ఫేమస్ అయ్యాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాందించుకున్నాడు. అనంతరం హాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం స్టార్ నటుడిగా ఎదిగిన ఈ నటుడు ఫుట్‌బాల్ క్రీడాకారుడు అనే విషయం చాలామందికి తెలియదు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మాజీ భార్య డానీ గార్సియా కుమార్తె సిమోన్, ప్రస్తుత భార్య లారెన్ హషియాన్‌తో జాస్మిన్, టియానా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తాజాగా ఈయన సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకున్నాడు. ఫాదర్స్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియోలో తన పిల్లలపై ఉన్న అపారమైన ప్రేమను వ్యక్తపరిచాడు. ఈ ఏడాది జూన్ 20న ఫాదర్స్ డే 2021 ను నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏడాది జూన్ నెల మూడో ఆదివారం ఫాదర్స్‌డే సెలబ్రేట్ చేస్తారనే విషయం మనకు తెలిసిందే.
“ప్రతీ తండ్రి ఒక కొడుకు కావాలని కోరుకుంటాడు. కానీ, ప్రతీ తండ్రికి ఓ కుమార్తె చాలా అవసరం” అని వీడియోలో రాసుకొచ్చాడు. అలాగే “ఈ కోట్ చేసిన దేవుడికి ధన్యవాదాలు, ఎందుకంటే నా ఇంట్లో అంతా అమ్మాయిలే ఉన్నారు. అలాగే ఇళ్లంతా ఈస్ట్రోజెన్ తో నిండి ఉంద” ని పేర్కొన్నాడు.
అలాగే మరో కోట్ లో..” కష్టపడి పనిచేసే నాతోటి తండ్రులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే, ఎప్పటికీ అలానే ఉండాలంటూ” ముగించాడు.
4.1 మిలియన్లకు పైగా వ్యూస్‌తో ఈ వీడియో దూసుకపోతోంది. దీనికి ష్యాన్స్ చాలా అందంగా చెప్పారంటూ కొంతమంది కామెంట్ చేస్తే.. మనలోని ఆత్మ ఇలా పలికిస్తుందని మరికొందరు కామెంట్ చేశారు. ఇది నిజం బ్రదర్ అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 189 మిలియన్ల మంది డ్వేన్ జాన్సన్ ఫాలో అవుతున్నారు. అడ్వర్‌టైజ్‌మెంట్ల కోసం చేసే ఒక్క పోస్టు ద్వారా దాదాపు 7,59,93,050 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడం. ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించే లిస్టులో డ్వేన్ బాన్సన్ తొలి స్థానంలో ఉన్నాడు.
Also Read: