బాలరాముడికి 101 కిలోల బంగారం విరాళం.. ఎవరిచ్చారో తెలుసా ??

బాలరాముడికి 101 కిలోల బంగారం విరాళం.. ఎవరిచ్చారో తెలుసా ??

Phani CH

|

Updated on: Jan 25, 2024 | 6:49 PM

బాల రాముడికి దేశ, విదేశాలకు చెందిన ఎందరో రామభక్తులు తమవంతు విరాళాలు సమకూర్చారు. ఇలా రాముల వారికి భూరి విరాళం అందించిన వారిలో దిలీప్‌ కుమార్‌ వి లాఖి, ఆయన కుటుంబం ముందువరుసలో ఉంటుంది. సూరత్‌కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి రాములోరికి 101 కిలోల బంగారాన్ని కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ బంగారాన్ని రామాలయం తలుపులు, గర్భగుడి, త్రిశూలం, ఢమరుకం, పిల్లర్లకు కేటాయించారు.

బాల రాముడికి దేశ, విదేశాలకు చెందిన ఎందరో రామభక్తులు తమవంతు విరాళాలు సమకూర్చారు. ఇలా రాముల వారికి భూరి విరాళం అందించిన వారిలో దిలీప్‌ కుమార్‌ వి లాఖి, ఆయన కుటుంబం ముందువరుసలో ఉంటుంది. సూరత్‌కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి రాములోరికి 101 కిలోల బంగారాన్ని కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ బంగారాన్ని రామాలయం తలుపులు, గర్భగుడి, త్రిశూలం, ఢమరుకం, పిల్లర్లకు కేటాయించారు. ప్రస్తుత మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర 68వేల రూపాయలుగా ఉంది. ఆ లెక్కన రామాలయానికి లాఖి కుటుంబం 68 కోట్లు విరాళంగా ఇచ్చినట్లయింది. రామ మందిర ట్రస్టుకు వచ్చిన విరాళాల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక మొత్తం అని తెలుస్తోంది. లాఖి మాత్రమే కాకుండా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరాయ్‌ బాపూ కూడా రామమందిరానికి భారీ విరాళం ఇచ్చారు. ఈయన 11.3 కోట్లు రామ మందిరానికి విరాళంగా ఇచ్చారు. అమెరికా, కెనడా, బ్రిటన్‌లో నివసిస్తున్న రామ భక్తులు మరో 8 కోట్లు సమకూర్చారు. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద భాయ్‌ ఢోలాకియా 11 కోట్లు విరాళమిచ్చారు. యూపీకి చెందిన ఓ వ్యక్తి మందిరం కోసం కోటి ఇవ్వాలని నిర్ణయించుకుని అందుకుగాను 16 ఎకరాల పొలాన్ని అమ్మేశాడట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

62 ఏళ్లుగా కంటిమీద కునుకే వేయని వ్యక్తి !! ఆశ్చర్యపోతున్న వైద్యశాస్త్రవేత్తలు

రామజన్మభూమి ట్రస్ట్‌కు అంబానీ భారీ విరాళం

ఇక్కడ తవ్వే కొద్ది వజ్రాలు !! 65 ఏళ్లల్లో కోటి కేరట్ల వెలికితీత

ఇక్కడ ఎంతటి కోటీశ్వరుడైనా అడుక్కోవాల్సిందే

Hanuman: UP సీఎంను కదిలించిన ‘హనుమాన్’