62 ఏళ్లుగా కంటిమీద కునుకే వేయని వ్యక్తి !! ఆశ్చర్యపోతున్న వైద్యశాస్త్రవేత్తలు
ఒక్కరోజు కాస్త నిద్ర తక్కువైతే చాలు మర్నాటికి ముఖం వాడిపోయి.. నిస్సత్తువలో కూరుకుపోతాం. అదే ఏవో కారణాలతో రెండు రోజుల పాటు నిద్రకు దూరమయ్యామంటే ఇక ఎక్కడపడితే అక్కడ పడుకుండిపోతాం. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా 60 ఏళ్లకుపైబడి నిద్రపోకుండా ఉన్నాడంటే నమ్ముతారా? వియత్నాంకు చెందిన థాయ్ అంజోక్ అనే వ్యక్తి తనకు 62 ఏళ్లుగా నిద్ర పట్టడం లేదని మీడియాకు తెలిపాడు. 1962 నుంచి తన జీవితం నుంచి నిద్ర అనేది శాశ్వతంగా మాయమైందని తెలిపాడు.
ఒక్కరోజు కాస్త నిద్ర తక్కువైతే చాలు మర్నాటికి ముఖం వాడిపోయి.. నిస్సత్తువలో కూరుకుపోతాం. అదే ఏవో కారణాలతో రెండు రోజుల పాటు నిద్రకు దూరమయ్యామంటే ఇక ఎక్కడపడితే అక్కడ పడుకుండిపోతాం. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా 60 ఏళ్లకుపైబడి నిద్రపోకుండా ఉన్నాడంటే నమ్ముతారా? వియత్నాంకు చెందిన థాయ్ అంజోక్ అనే వ్యక్తి తనకు 62 ఏళ్లుగా నిద్ర పట్టడం లేదని మీడియాకు తెలిపాడు. 1962 నుంచి తన జీవితం నుంచి నిద్ర అనేది శాశ్వతంగా మాయమైందని తెలిపాడు. ఓ యూట్యూబర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో థాయ్ అంజోక్ తన కథను వివరంగా చెప్పాడు. 80 ఏళ్లుదాటిన థాయ్ అంజోక్‌కు 1962లో ఒక రోజు రాత్రి జ్వరం వచ్చిందట. అప్పటి నుంచి ఒక్కరోజు కూడా నిద్రపోలేదని అంజోక్ చెప్పాడు. అయితే అంజోక్‌కు హాయిగా నిద్రపోవాలనే కోరిక తీరనిదిగా మిగిలిపోయిందట. వైద్య నిపుణులు ఈ రకమైన వ్యాధిని నిద్రలేమి అని చెబుతారు. దీని కారణంగా శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతుంది. అయితే నిద్రలేమి అనేది థాయ్ అంజోక్ ఆరోగ్యంపై ఏమాత్రం ప్రభావం చూపకపోవడం వైద్యశాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. థాయ్ అంజోక్ ఈ వయసులోనూ పొలంలో పనిచేస్తుంటాడు. ఇతను గ్రీన్ టీ, రైస్ వైన్ ఇష్టంగా తాగుతాడట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రామజన్మభూమి ట్రస్ట్‌కు అంబానీ భారీ విరాళం
ఇక్కడ తవ్వే కొద్ది వజ్రాలు !! 65 ఏళ్లల్లో కోటి కేరట్ల వెలికితీత
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

