Devara 2: దేవర 2కు సైలెంట్‌గా గుడ్‌బై..? అభిమానుల్లో పెరుగుతున్న అనుమానాలు
N. T. Rama Rao Jr. నటించిన ‘దేవర’ చిత్రానికి సీక్వెల్‌పై అనుమానాలు పెరుగుతున్నాయి. సీక్వెల్ ఉంటుందని ప్రకటించినప్పటికీ, తాజాగా ఎలాంటి అధికారిక అప్డేట్లు రాకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. Koratala Siva కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం, సోషల్ మీడియాలో కూడా ‘దేవర 2’ ప్రస్తావన లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తుపై చర్చ మొదలైంది.
ఇప్పుడు కాకపోయినా మరో ఏడాది తర్వాతైనా దేవర 2 ఉంటుందేమో అనే ఆశలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో ఉండేవి.. కానీ ఇప్పుడా ఆశలు ఆవిరైపోయాయి. దేవర కథేంటి.. విలన్లు ఎవరు.. వర ఏమయ్యాడు.. దేవరను చంపిందెవరు.. ఇలా ప్రశ్నలు చాలానే మిగిలిపోయేలా ఉన్నాయి. వీటన్నింటికీ సమాధానం కష్టమే. దేవర 2 వచ్చేలా లేదు. ఎందుకో మీరూ చూసేయండి. దేవర సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ చాలా రోజులుగా చెప్తున్నారు.. కానీ పరిస్థితులు చూస్తుంటే దేవర 2 ఇక రావడం కష్టమే అనిపిస్తుంది. ముందు నుంచే సీక్వెల్ మీద తారక్ పెద్దగా ఆసక్తి చూపించట్లేదనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అన్నట్లుగానే దేవర 2 నానాటికీ లేట్ అవుతూనే ఉంది. జూన్ నుంచే మొదలవుతుందని నిర్మాత చెప్పినా.. అది జరగలేదు. రొటీన్ కంటెంట్‌తోనే వచ్చినా.. పాటలు, రిలీజ్ టైమ్, తారక్ ఇమేజ్ హెల్ప్ అయి దేవర బయటపడింది.. అది కొరటాల రేంజ్ సినిమా కాదనే ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. పైగా ఎన్టీఆర్ ఇమేజ్‌తో దేవర ఆడిందని ఫ్యాన్స్ ఇప్పటికీ నమ్ముతారు. అందుకే దేవర 2 కంటే మిగిలిన సినిమాలపైనే తారక్ ఫ్యాన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దేవర 2 ఉండకపోవచ్చనే విషయాన్ని చెప్పకనే చెప్పారు మేకర్స్. జూన్ 15న కొరటాల శివ పుట్టిన రోజు కావడంతో ఇటు ఎన్టీఆర్, అటు ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి బర్త్ డే విషెస్ అందాయి. కాకపోతే అందులో దేవర 2 టాపిక్ లేదు. ముఖ్యంగా తారక్ అయితే ‘నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌కు ఆల్ ది బెస్ట్ శివ’ అన్నారే కానీ.. దేవర 2 గురించి చెప్పలేదు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్వీట్‌లోనూ దేవర 2 ఊసేలేదు. మే 20న తారక్ పుట్టినరోజు నాడే దేవర 2 అప్‌డేట్ లేదు.. ఇప్పుడు కొరటాల బర్త్ డేకు కూడా ఎలాంటి అప్డేట్ రాలేదు. దీన్నిబట్టి సైలెంట్‌గా దేవర 2ను సైడ్ చేస్తున్నారని అభిమానులకు అర్థమవుతుంది. ఇప్పటికే బాలయ్యకి కథ చెప్పి.. ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నారు కొరటాల. ఈ లెక్కన దేవర కథ అసంపూర్తిగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లలు.. డీఎన్‌ఏ టెస్టులో షాకింగ్ విషయాలు
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్‌నెస్..!
శ్రేయస్ అయ్యర్ ఇంటి అద్దె రూ.7.14 కోట్లు
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్‌నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?
క్లీనర్, కార్ వాషర్గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..

