ఆ మహిళ ఇంటి తలుపు తట్టిన కలెక్టర్‌… ఏం చేశాడో చూడండి

Updated on: Feb 23, 2025 | 10:11 PM

వినూత్న ఆలోచనలు, కార్యక్రమాలతో జిల్లా పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు ఆ జిల్లా కలెక్టర్‌. చాక్‌పీస్‌ చేతపట్టి పాఠశాలలో విద్యార్ధులకు పాఠాలు చెప్పారు.. పదవ తరగతి విద్యార్థులను ప్రోత్సహిస్తూ.. వారి ఇంటి తలుపు తట్టి వేకప్ కాల్ కు శ్రీకారం చుట్టారు. తాజాగా ఆ అధికారి ఓ మహిళ ఇంటి తలుపు తట్టారు. అక్కడ ఏం చేశారో మీరే చూడండి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా హనుమంతరావు వచ్చిన కొద్ది రోజుల్లోనే పాలనలో తనదైనశైలిలో దూసుకెళ్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఆకస్మిక తనిఖీలతో జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్‌ చేస్తున్నారు. విద్య, వైద్యం ద్వారానే సమాజాభివృద్ధి చెందుతుందని నమ్మిన కలెక్టర్ హనుమంతరావు విద్యా, వైద్య ఆరోగ్యశాఖలపై దృష్టిని సారించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచడమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖను పటిష్టం చేసే పనిలో పడ్డారు. తరచూ ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేస్తూ వైద్యులు సిబ్బంది పనితీరు, వైద్య సేవలను ఆయన సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచడమే లక్ష్యంగా ‘తలుపు తట్టి శ్రీ’ కార్యక్రమాన్ని చేపట్టారు. గుండాల మండలం అనంతారంలోని హైరిస్క్‌ గర్భిణి అపర్ణ ఇంటిని సందర్శించారు. కలెక్టర్‌ను వచ్చానంటూ పరిచయం చేసుకున్నారు. ఆరోగ్యం ఎలా ఉందని, వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారా, ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారని గర్భిణిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో నిపుణులైన వైద్యులు ఉన్నారని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేయించుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయని కలెక్టర్ సూచించారు. 9వేల రూపాయల విలువైన పౌష్టికాహార కిట్లను గర్భిణీ మహిళ పూర్ణిమకు కలెక్టర్‌ అందజేశారు. ‘తలుపు తట్టి శ్రీ’ కార్యక్రమం ద్వారా మొదటి రోజు 300 మంది హైరిస్క్‌ గర్భిణుల ఇళ్లను వైద్యాధికారులు సందర్శించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రభాస్‌ చేతిలో… త్రివిక్రమ్‌ పెద్ద కొడుకు

చై – శోభితల మనసు బంగారం.. ఎంత మంచి పని చేశారో

Manchu Lakshmi: భర్తతో దూరంగా ఉంటున్నారు ఎందుకు? మంచు లక్ష్మీ షాకింగ్ ఆన్సర్

సెల్ఫీ పేరుతో ముద్దుకు ప్రయత్నం! హీరోయిన్‌కు చేదు అనుభవం

‘జీవితంలో దొరికిన గొప్ప గిఫ్ట్’ పవన్‌తో స్నేహం పై ఆనంద్ సాయి ఎమోషనల్