ట్రాన్స్‌జెండర్స్ సేవలతో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయా ??
హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా కొత్త వాలంటీర్లు రంగంలోకి దిగనున్నారు. సిటీ పరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్ జెండర్ లను వాలంటీర్లుగా నియమించుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.
హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా కొత్త వాలంటీర్లు రంగంలోకి దిగనున్నారు. సిటీ పరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్ జెండర్ లను వాలంటీర్లుగా నియమించుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీస్ విభాగంతో పాటు హోమ్ గార్డ్స్… సిటీలో ఈ విధులు నిర్వహిస్తున్నారు. హోం గార్డ్స్ తరహాలోనే ట్రాన్స్ జెండర్లకు ఈ విధులు అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికోసం ఆసక్తి ఉన్న ట్రాన్స్జెండర్ల నుంచి వివరాలను సేకరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణలో రిజిస్టర్ అయిన ట్రాన్స్‌జెండర్లు 3,000 మందికి పైగా ఉంటే, నగరంలోనే 1000 మంది ఉన్నట్టు అంచనా. సమాజానికి దూరంగా తమదైన ప్రపంచంలో బతికే వీరిపై ఇప్పటికీ వివక్ష కనిపిస్తోంది. ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో రాణించే ప్రతిభా సామర్థ్యం ఉన్నా వీరికి ఆదరణ కరువవుతోంది. ఇప్పుడు సీఎం రేవంత్ నిర్ణయంతో..ట్రాన్స్‌జెండర్లు నయా అవతార్‌తో, ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు వాలంటీర్ల రూపంలో రానున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చూస్తుండగానే నడిరోడ్డుపై భారీ గొయ్యి !! కాస్తయితే మింగేసేదే !!
ఆధార్ కార్డుదారులకు శుభవార్త.. డిసెంబర్ 14 వరకూ గడువు పెంచిన ఉడాయ్
వినాయకుడి చేతిలో లడ్డూలు.. దేనికోసం దొంగిలిస్తున్నారో తెలుసా ??