Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Immersion: వినాయకుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు.? ఓహో ఇదా స్టోరీ..

Ganesh Immersion: వినాయకుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు.? ఓహో ఇదా స్టోరీ..

Anil kumar poka

|

Updated on: Sep 17, 2024 | 12:31 PM

భాద్రపద మాసంలో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తుంది. వేసవి వేడి తగ్గి.. వర్షాలు పడే కాలమిది. ఈ కాలంలో భూమికి ప్రాణశక్తి అందుతుంది. నదులు నిండుగా ప్రవహిస్తాయి. ఇలాంటి కాలంలో వినాయకచవితికి భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజిస్తాం. 9 రోజుల పూజల తరువాత నిమజ్జనం చేస్తాం. అలా నిమజ్జనం చేయడం వెనుక కారణమేంటి.? ఆ లంబోదరుడిని గంగమ్మ ఒడికి పంపడం వెనుక అసలు కథేంటి? గణపతి నిమజ్జనం అనేది తరతరాలుగా వస్తున్న ఆచారం.

భాద్రపద మాసంలో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తుంది. వేసవి వేడి తగ్గి.. వర్షాలు పడే కాలమిది. ఈ కాలంలో భూమికి ప్రాణశక్తి అందుతుంది. నదులు నిండుగా ప్రవహిస్తాయి. ఇలాంటి కాలంలో వినాయకచవితికి భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజిస్తాం. 9 రోజుల పూజల తరువాత నిమజ్జనం చేస్తాం. అలా నిమజ్జనం చేయడం వెనుక కారణమేంటి? ఆ లంబోదరుడిని గంగమ్మ ఒడికి పంపడం వెనుక అసలు కథేంటి? గణపతి నిమజ్జనం అనేది తరతరాలుగా వస్తున్న ఆచారం. నిజానికి హిందూ సంప్రదాయంలో దేవుళ్లందరికీ పూజలు చేస్తారు. కాని వాటి ప్రతిమలు మాత్రం పూజల తరువాత.. ఇంట్లోనే ఉంటాయి. వినాయకుడి విగ్రహాన్ని మాత్రం.. నిమజ్జనం చేస్తారు. గణాలకు అధిపతి అయిన గణనాయకుడిని నిమజ్జనం చేయడం వెనుక శాస్త్రీయ కారణాలతో పాటు.. ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి. హిందూ సంప్రదాయంలో చేసుకునే పండగలన్నింటి వెనుక.. ఆధ్యాత్మిక కారణంతోపాటు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అవి మనిషి జీవనవిధానంతో ముడిపడి ఉంటాయి. గణేశుడి విగ్రహాన్ని తయారు చేయడానికి కొత్త మట్టిని ఉపయోగించాలని పెద్దలు చెబుతారు. ఎందుకంటే.. విగ్రహాన్ని తయారు చేయడం కోసం.. వర్షాకాలానికి ముందే చెరువులు, కుంటల్లో ఉన్న మట్టిని సేకరిస్తారు. అక్కడి నుంచే మట్టిని తీసుకురమ్మని చెబుతారు. దీనికి కారణం.. వర్షాకాలంలో చెరువులు, కుంటల్లో నీరు పూర్తిగా చేరుతుంది. ఇందులో పూడికలు ఉంటే.. ఆ నీరు.. ఊళ్లను ముంచెత్తుతుంది. అందుకే ముందుగానే పూడికలు తీసేస్తే.. ఈ సమస్య నుంచి ఊళ్లను రక్షించవచ్చు. గతంలో...