Watch: తిరుమల లడ్డూ వివాదం.. పవన్ కల్యాణ్ యోచనకు రంగరాజన్ మద్ధతు..!
Tirumala Laddu Row: తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతకు సంబంధించిన వివాదంపై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పందించారు. శ్రీవారి భక్తులు లడ్డూ ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారని అన్నారు. ప్రస్తుతం దీనిపై వివాదం నెలకొనడం భయంకరమైన, నమ్మలేని నిజమని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతకు సంబంధించిన వివాదంపై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పందించారు. శ్రీవారి భక్తులు లడ్డూ ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారని అన్నారు. ప్రస్తుతం దీనిపై వివాదం నెలకొనడం భయంకరమైన, నమ్మలేని నిజమని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దిశగా ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షిస్తున్నట్లు జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయొచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తిరుమల పవిత్రను కాపాడేందుకు చొరవ చూపాలని కోరారు.