Ambani Wedding: స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైన గిఫ్ట్స్‌.. రేటు తెలిస్తే షాక్.!

Ambani Wedding: స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైన గిఫ్ట్స్‌.. రేటు తెలిస్తే షాక్.!

Anil kumar poka

|

Updated on: Jul 17, 2024 | 11:34 AM

రిలయన్స్‌ గ్రూపు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ, నీతా దంపతుల చిన్న కుమారుడు అనంత్‌, ఫార్మారంగ వ్యాపారవేత్త వీరేన్, శైల మర్చంట్‌ల కుమార్తె రాధికా మర్చంట్‌ వివాహం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్సులోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ఈ కల్యాణానికి వేదికగా నిలిచింది. సుమారు రూ.5 వేల కోట్ల ఖర్చుతో జరిగిన ఈ పెళ్లి వేడుకలో దేశవిదేశాలకు చెందిన సినీ, రాజకీయ, వ్యాపార తదితర రంగాల ప్రముఖులు సందడి చేశారు.

రిలయన్స్‌ గ్రూపు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ, నీతా దంపతుల చిన్న కుమారుడు అనంత్‌, ఫార్మారంగ వ్యాపారవేత్త వీరేన్, శైల మర్చంట్‌ల కుమార్తె రాధికా మర్చంట్‌ వివాహం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్సులోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ఈ కల్యాణానికి వేదికగా నిలిచింది. సుమారు రూ.5 వేల కోట్ల ఖర్చుతో జరిగిన ఈ పెళ్లి వేడుకలో దేశవిదేశాలకు చెందిన సినీ, రాజకీయ, వ్యాపార తదితర రంగాల ప్రముఖులు సందడి చేశారు. కాగా, వివాహానికి హాజరైన తన స్నేహితులు, ఆత్మీయులకు అనంత్‌ అంబానీ అత్యంత ఖరీదైన వాచీలను కానుకగా అందజేసినట్లు తెలుస్తోంది. అడెమార్స్‌ పిగ్యుట్‌ బ్రాండ్‌కు చెందిన ఈ వాచీ ధర సుమారు కోటిన్నర నుంచి రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. అతిథుల కోసం అంబానీ కుటుంబం వీటిని ప్రత్యేకంగా సిద్ధం చేయించినట్లు సమాచారం. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, రణ్‌వీర్‌ సింగ్‌ వంటి తారలు ఈ వాచీలతో ఫొటోలకు ఫోజులిచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Jul 17, 2024 11:34 AM