Trumb Accused: ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే.? సెమీ ఆటోమేటిక్ గన్‌తో కాల్పులు
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులు జరిపిన దుండగుడిని భద్రతా సిబ్బంది కాల్చిపడేశారు. ప్రస్తుతం ట్రంప్ క్షేమంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఈ దాడిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓ వ్యక్తి దుర్మరణం చెందగా, మరొకరు గాయపడ్డారు. షూటర్‌ను 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా భద్రతా సిబ్బంది గుర్తించారు. అతను పెన్సిల్వేనియాలోని బెథెల్ పార్క్‌కు చెందిన వ్యక్తని ప్రకటించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులు జరిపిన దుండగుడిని భద్రతా సిబ్బంది కాల్చిపడేశారు. ప్రస్తుతం ట్రంప్ క్షేమంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఈ దాడిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓ వ్యక్తి దుర్మరణం చెందగా, మరొకరు గాయపడ్డారు. షూటర్‌ను 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా భద్రతా సిబ్బంది గుర్తించారు. అతను పెన్సిల్వేనియాలోని బెథెల్ పార్క్‌కు చెందిన వ్యక్తని ప్రకటించారు. AR 15 సెమీ ఆటోమేటిక్ గన్‌తో అతను కాల్పులు జరిపాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల ఎదురుకాల్పుల్లో క్రూక్స్ హతమయ్యాడు. అయితే క్రూక్స్ బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయడానికి పూర్తి ఆధారాలు దొరకలేదు. అతని దగ్గర నుంచి ఎలాంటి ID కార్డులు లభ్యం కాలేదు.
దీంతో.. DNA, బయోమెట్రిక్ ద్వారా నిందితుడి ఆధారాల నిర్ధారణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భద్రతా సిబ్బంది తెలిపారు. అయితే ట్రంప్‌ను చంపాలనే కుట్ర ఎవరిది..? ట్రంప్‌పై కాల్పులు జరిపిన దుండగుడినైతే గుర్తించారు.. స్పాట్‌లోనే అతన్ని మట్టుపెట్టారు.. కానీ అతని వెనుకున్నది ఎవరు..? ఇదే ఇప్పుడు FBI ముందున్న అతిపెద్ద సవాల్. ఇది ముమ్మాటికీ భద్రతా వైఫల్యమేనని విమర్శలు వస్తున్న వేళ FBI దర్యాప్తులో వేగం పెంచింది. అటు, అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ కూడా ఈ ఇష్యూని సీరియస్‌గానే తీసుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.