నీళ్లు నిలబడి తాగితే ఏమవుతుందో తెలుసా?

Edited By: Ravi Kiran

Updated on: Apr 30, 2025 | 8:34 PM

నీరు శరీరానికి ఎంత అవసరమో అందరికీ తెలుసు. ఆహారం లేకపోయినా కొన్నిరోజులు బ్రతకవచ్చు కానీ నీరు లేకపోతే ఒక్కరోజుకూడా బతకలేరు. మనిషి మనుగడకు నీరు తప్పనిసరి. అయితే దాదాపు అందరూ నిలబడే నీరు తాగుతారు. కానీ ఇది సరైన పద్ధతి కాదని నిపుణులు చెప్పేమాట. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు.

నీటిని ఎప్పుడైనా సరే ప్రశాంతంగా కూర్చొని తాగాలి. నిలబడి నీళ్లు తాగితే ఏం జరుగుతుందో…నిపుణులేమంటున్నారో ఇప్పుడు చూద్దాం. నిలబడి నీళ్లు తాగడంవల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఆహారం, గాలి ట్యూబ్‌కు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయే ఆస్కారం ఉంది. దీని ప్రభావం ఊపిరితిత్తులపైనే కాదు గుండెపై కూడా పడుతుందట. నిలబడి నీరు తాగడం వల్ల కడుపులో నీటి పరిమాణం పెరిగి, కడుపు దిగువ భాగంలోని గోడలపై ఒత్తిడి పడుతుందట. ఆ పరిస్థితిలో హెర్నియాకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు, నిలబడి నీళ్లు తాగడంవల్ల జీర్ణవ్యవస్థపై ఎఫెక్ట్ పడుతుందట. తాగిన నీళ్లు వేగంగా వెళ్లి పొత్తికడుపుపై ప్రభావం చూపుతాయి. ఇది చాలా ప్రమాదకరం. ఇలా చేయడం వల్ల ద్రవాల సమతుల్యత దెబ్బతిని టాక్సిన్స్ పెరుగుతాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ వస్తువులను ముట్టుకున్నారా? వెంటనే చేతులు కడుక్కోండి.. లేదంటే..

చొక్కాలు విప్పి.. ‘ఎక్స్‌ప్రెస్ వే’ పై ఓవరాక్షన్

క్యారెట్ జ్యూస్‌ తాగడం వల్ల నమ్మలేని ప్రయోజనాలివే

రైలును ఆపేసి మరీ ఈ లోకో పైలట్‌ చేసిన పనికి.. అందరు షాక్

ఏ భర్తా ఇవ్వని గిఫ్ట్‌ ఇదీ! కళ్లు చెమర్చే వైరల్‌ వీడియో