Buying House: ఇల్లు కొంటున్నారా? మరి అవన్నీ చెక్ చేశారా? అవేంటో తెలుసుకోండి!

Buying House: ఇల్లు కొంటున్నారా? మరి అవన్నీ చెక్ చేశారా? అవేంటో తెలుసుకోండి!

Subhash Goud

|

Updated on: Mar 23, 2024 | 12:10 PM

పెట్టుబడి కోసం ఆస్తులు కొనాలన్నా.. నివాసం ఉండాలన్నా.. చాలా మంది ఫ్లాట్, భూమి, ఇల్లు కొనాలన్నా బడ్జెట్‌ను మాత్రమే చూస్తారు. బడ్జెట్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇది వాళ్ల జేబుకు సంబంధించిన విషయం. అలాగని భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలను మర్చిపోకూడదు. మీరు ఎక్కడ ఇల్లు కొనుగోలు చేసినా... దాని పరిసరాల్లోని కొన్ని ప్రత్యేక అంశాలను గమనించాలి. ఇది మీరు అక్కడ నివసించడాన్ని..

పెట్టుబడి కోసం ఆస్తులు కొనాలన్నా.. నివాసం ఉండాలన్నా.. చాలా మంది ఫ్లాట్, భూమి, ఇల్లు కొనాలన్నా బడ్జెట్‌ను మాత్రమే చూస్తారు. బడ్జెట్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇది వాళ్ల జేబుకు సంబంధించిన విషయం. అలాగని భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలను మర్చిపోకూడదు. మీరు ఎక్కడ ఇల్లు కొనుగోలు చేసినా… దాని పరిసరాల్లోని కొన్ని ప్రత్యేక అంశాలను గమనించాలి. ఇది మీరు అక్కడ నివసించడాన్ని ఈజీగా చేస్తుంది. దీంతోపాటు కొత్త ఇంటిని కొనడానికి మీ పాత ఇంటిని ఎప్పుడు అమ్మినా మంచి ధర వస్తుంది. సో.. ఇంటిని కొనేముందు.. దాని పరిసరాల్లో ఏఏ ప్రత్యేక అంశాలను చెక్ చేయాలి?చాలా మంది వ్యక్తులు పెళ్లి చేసుకున్నప్పుడో, పిల్లలు పుట్టినప్పుడో ఇల్లు కొనాలనుకుంటారు. అలాంటి వారికి, ఇంటి సమీపంలో ఒక మంచి విద్యా సంస్థ.. అంటే స్కూల్, కాలేజ్ ఉండటం చాలా ముఖ్యం. ప్రాక్టికల్ లైఫ్ లో కూడా.. పెద్ద సంస్థల చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఇల్లు కొనాలంటే.. దాని ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇల్లు కొనే ముందు చాలా విషయాలను గమనించడం చాలా ముఖ్యం. ఇల్లు కొంటే దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? వీటిని ఒక్కొక్కటిగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం.