Onion Prices : ఉల్లి ఘాటు.. కిలో రూ.70కి చేరిక !! టమాటా కూడా పైపైకి

Onion Prices : ఉల్లి ఘాటు.. కిలో రూ.70కి చేరిక !! టమాటా కూడా పైపైకి

Phani CH

|

Updated on: Oct 29, 2023 | 1:53 PM

ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు ఉల్లి ప్రజలను ఏడిపించేందుకు సిద్ధమవుతోంది. వంటింట్లో పొయ్యి వెలిగించాలంటే ఆలోచిస్తున్నారు సామాన్య ప్రజలు. మొన్నటిదాగా కిలో రూ.20-30 పలికిన కిలో ఉల్లిగడ్డ ధర ఢిల్లీలో ఇప్పుడు ఏకంగా రూ.80 పలుకుతుంది. ఈ రోజు ఐదు కిలోల ఉల్లిపాయల ధర రూ.350కి చేరిందని ఢిల్లీలోని ఘాజీపూర్‌ కూరగాయల మార్కెట్‌లోని ఓ ఉల్లిగడ్డ వ్యాపారి చెప్పారు. నిన్న అది రూ.300లు ఉందని అన్నారు.

ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు ఉల్లి ప్రజలను ఏడిపించేందుకు సిద్ధమవుతోంది. వంటింట్లో పొయ్యి వెలిగించాలంటే ఆలోచిస్తున్నారు సామాన్య ప్రజలు. మొన్నటిదాగా కిలో రూ.20-30 పలికిన కిలో ఉల్లిగడ్డ ధర ఢిల్లీలో ఇప్పుడు ఏకంగా రూ.80 పలుకుతుంది. ఈ రోజు ఐదు కిలోల ఉల్లిపాయల ధర రూ.350కి చేరిందని ఢిల్లీలోని ఘాజీపూర్‌ కూరగాయల మార్కెట్‌లోని ఓ ఉల్లిగడ్డ వ్యాపారి చెప్పారు. నిన్న అది రూ.300లు ఉందని అన్నారు. అంతముందు రోజు రూ.200గా ఉండేదని వారం రోజులుగా ఉల్లిపాయల ధరలు పెరుగుతూ వస్తున్నాయని చెప్పారు. ఉత్పత్తి తక్కువగా ఉండటమే దీనికి కారణమన్నారు. రానున్న రోజుల్లో ఉల్లిపాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మరో వ్యాపారి చెప్పారు. నవరాత్రి ముందు రూ.50గా ఉన్న కిలో ఉల్లిగడ్డ ధర ఇప్పుడు రూ.70కి చేరిందన్నారు. డిసెంబరు వరకు ఉల్లి ధరలు పెరిగే అవకాశం ఉందని, అలాగే ఖరీఫ్ కొత్త పంట రాకలో కూడా జాప్యం జరుగుతోందని, దాదాపు రెండు నెలలు ఆలస్యం కావచ్చని భావిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికా నరహంతకుడు ఆత్మహత్య.. ఊపిరి పీల్చుకుంటున్న లెవిస్టన్ ప్రజలు

కర్ణాటకలో భారీ ఉడుము ప్రత్యక్షం !! దాని పొడవు ఎన్ని అడుగులో తెలుసా ??

Chandra Grahan 2023: ఏ గ్రహణ ప్రభావం పడని ఏకైక ఆలయం

అత్యాచారానికి పాల్పడితే ఆ దేశంలో ఏంచేస్తారో తెలుసా ??

Khaidi: ఖైదీ 40 ఏళ్లు… చిరు ఎమోషనల్ ట్వీట్