అమెరికా నరహంతకుడు ఆత్మహత్య.. ఊపిరి పీల్చుకుంటున్న లెవిస్టన్ ప్రజలు
అమెరికాలోని మైనె రాష్ట్రం లెవిస్టన్ లో కాల్పులు జరిపి 22 మందిని పొట్టనపెట్టుకున్న నరహంతకుడు చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో రాబర్ట్ కార్డ్ అనే మాజీ ఆర్మీ ఆఫీసర్ ప్రధాన అనుమానితుడని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. తాజాగా లిస్బన్ ఫాల్స్ సమీపంలో రాబర్ట్ మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. రాబర్ట్ తనను తాను కాల్చుకుని చనిపోయి ఉంటాడని ప్రాథమికంగా తేలిందన్నారు. లెవస్టన్ లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్, బౌలింగ్ అలే లో కాల్పులు జరిపి 22 మందిని రాబర్ట్ హత్య చేశాడని పోలీసులు చెప్పారు.
అమెరికాలోని మైనె రాష్ట్రం లెవిస్టన్ లో కాల్పులు జరిపి 22 మందిని పొట్టనపెట్టుకున్న నరహంతకుడు చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో రాబర్ట్ కార్డ్ అనే మాజీ ఆర్మీ ఆఫీసర్ ప్రధాన అనుమానితుడని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. తాజాగా లిస్బన్ ఫాల్స్ సమీపంలో రాబర్ట్ మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. రాబర్ట్ తనను తాను కాల్చుకుని చనిపోయి ఉంటాడని ప్రాథమికంగా తేలిందన్నారు. లెవస్టన్ లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్, బౌలింగ్ అలే లో కాల్పులు జరిపి 22 మందిని రాబర్ట్ హత్య చేశాడని పోలీసులు చెప్పారు. ఆపై తన కారులో పారిపోయిన రాబర్ట్ కోసం మైనె పోలీసులు లెవిస్టన్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు రాబర్ట్ బంధువుల ఇంట్లోనూ సోదాలు చేశారు. హంతకుడు బయటే తిరుగుతున్నాడని పోలీసులు హెచ్చరించడంతో మైనె రాష్ట్రంలోని లెవిస్టన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. స్కూళ్లు, ఆఫీసులు, షాపింగ్ మాల్స్ సహా అన్నీ మూసివేశారు. రెండు రోజుల పాటు జనం భయాందోళనలతో బయటకు రాలేదు. వీధుల్లో భారీ సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బంది ఆయుధాలతో తనిఖీలు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కర్ణాటకలో భారీ ఉడుము ప్రత్యక్షం !! దాని పొడవు ఎన్ని అడుగులో తెలుసా ??
Chandra Grahan 2023: ఏ గ్రహణ ప్రభావం పడని ఏకైక ఆలయం
అత్యాచారానికి పాల్పడితే ఆ దేశంలో ఏంచేస్తారో తెలుసా ??
Khaidi: ఖైదీ 40 ఏళ్లు… చిరు ఎమోషనల్ ట్వీట్
Mahesh Babu: అమ్మ చివరి కోరిక తీర్చడం కోసం.. సిద్దమవుతున్న మహేష్
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు

