ట్రైన్ టికెట్ చిరిగిపోయిందా ?? అయితే ఇలా చేయండి
దూరప్రయాణాలు చేసేవాళ్లు ఎక్కవగా రైళ్లనే ఎంచుకుంటారు. రైలు ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. రోజూ లక్షలమందిని రైళ్లు తమ గమ్యస్థానాలకు చేర్చుతుంటాయి. అందుకే ప్రయాణికులు ముందుగానే టికెట్లను రిజర్వేషన్ చేయించుకుంటారు. వాటిని భద్రంగా దాచుకుంటారు. ఎంత భద్రంగా దాచుకున్నా ప్రయాణ సమయానికి ఒక్కోసారి టికెట్లను పోగొట్టుకుంటుంటారు కొందరు. తీరా రైలు ఎక్కిన తర్వాత టికెట్ కనిపించక ఇబ్బందులు పడతారు.
దూరప్రయాణాలు చేసేవాళ్లు ఎక్కవగా రైళ్లనే ఎంచుకుంటారు. రైలు ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. రోజూ లక్షలమందిని రైళ్లు తమ గమ్యస్థానాలకు చేర్చుతుంటాయి. అందుకే ప్రయాణికులు ముందుగానే టికెట్లను రిజర్వేషన్ చేయించుకుంటారు. వాటిని భద్రంగా దాచుకుంటారు. ఎంత భద్రంగా దాచుకున్నా ప్రయాణ సమయానికి ఒక్కోసారి టికెట్లను పోగొట్టుకుంటుంటారు కొందరు. తీరా రైలు ఎక్కిన తర్వాత టికెట్ కనిపించక ఇబ్బందులు పడతారు. ఇక టీటీ కూడా వారిని టికెట్ లేని ప్రయాణికుడిగానే పరిగణిస్తారు. అందుకే ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా భారతీయ రైల్వే ఓ ప్రత్యామ్నాయ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. టికెట్ పోయిన సందర్భంలో ప్రయాణానికి ఇబ్బంది రాకుండా డూప్లికేట్ టికెట్‌ను పొందే వీలును భారతీయ రైల్వే కల్పిస్తోంది. దీనికి కొంతమొత్తం చెల్లించాల్సి ఉంటుంది. డూప్లికేట్ టికెట్ కోసం చార్ట్ ప్రిపేర్ కాకముందే రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కౌంటర్ వద్దకు వెళ్లి విషయాన్ని తెలియజేయాలి. లేదంటే ఛార్ట్ ప్రిపేర్ అవ్వక ముందు, ఛార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. ఒకవేళ మీ టికెట్ కన్ఫర్మ్ అయి ఛార్ట్ ప్రిపేపర్ అవ్వకముందే రైల్వే అధికారులను సంప్రదిస్తే మీకు డూప్లికేట్ టికెట్‌ను జారీ చేస్తారు. ఒక్కో ప్రయాణికుడి నుంచి క్లరికేజ్ ఛార్జీలు వసూలు చేస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మార్చుతున్నారా ??
తెలంగాణలో హాఫ్ డే స్కూల్స్.. ఎప్పటి నుంచంటే ??
Katrina Kaif: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కత్రీనా ఎందుకలా చేసింది ??
Mahesh Babu: ఇదికదా కిక్ అంటే !! జక్కన్న మూవీలో 8 గెటప్స్‌లో మహేష్