భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..?
బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్టానికి చేరింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. బంగారం పది గ్రాముల ధర రూ.లక్షా పదివేల మార్క్ దాటి పరుగులు పెడుతుండగా.. వెండి కిలో ధర రూ.లక్షా 40వేల మార్క్ కు చేరుకుంది.
సెప్టెంబర్ 10, బుధవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,12,800 రూపాయిలు ఉండగా, 22 కేరట్ల గోల్డ్ ధర రూ. 1,04,450 రూపాయిలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,27,700 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల బంగార ధర 1,10,450, 22 కేరట్ల ధర రూ.1,01,260 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,30,100లుగా ఉంది. ముంబైలో 24 కేరట్ల బంగార ధర 1,10,300, 22 కేరట్ల ధర రూ.1,01,110 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,30,100లుగా ఉంది. చెన్నైలో 24 కేరట్ల బంగారం ధర రూ.1,10,740 ఉండగా.. 22 కేరట్ల ధర రూ.1,01,510 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,39,900 గా ఉంది. కోల్‌కతాలోలో 24 కేరట్ల బంగారం ధర రూ.1,10,300 ఉండగా.. 22 కేరట్ల ధర రూ.1,01,100 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,39,900 గా ఉంది. రెండునెలల్లో పసిడి స్పీడుకు పగ్గాలు పడటం లేదు. రోజురోజుకీ ధర పెరుగుతుందేగానీ, డౌన్‌ట్రెండ్ మాత్రం కనిపించడం లేదని మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎయిర్‌పోర్ట్ అధికారుల చేతివాటం బ్యాటరీలు, నూనె దొంగిలించి..
ఆ బాలుడిని చూసి ఆగిపోయిన భారీ వరద
అయ్యో.. మంటల్లో కాలిపోతూ స్కూటీపై ఆసుపత్రికి వెళ్లిన మహిళ
Bigg Boss Telugu 9: మొదలైన ఫస్ట్ వీక్ నామినేషన్స్.. పిచ్చి పిచ్చిగా లొల్లి పెట్టుకున్న బ్యూటీలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

