పండగ వేళ పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే?
దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన వేళ.. సోమవారం బంగారం ధర మళ్లీ స్వల్పంగా పెరిగింది. ఇటీవల కాలంలో బంగారం ధరలు వరుసగా పెరుగుతోంది. గత నాలుగు రోజుల్లోనే తులం బంగారం ధర రూ.1,400 పెరిగింది. ఇక రాబోయే రోజుల్లో వరుసగా పండుగలు రావటంతో బంగారం కొనుగోళ్లు పెరుగుతాయని, ఈ క్రమంలో ధరలు తగ్గక పోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సెప్టెంబర్ 22, సోమవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం 1,12,580 రూపాయలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం 1,03,200 రూపాయలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,44,900 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల పసిడి ధర రూ.1,12,290, 22 కేరట్ల ధర రూ.1,02,940 లుగా ఉంది. కేజీ వెండి ధర రూ.1,34,900గా ఉంది. ముంబైలో 24 కేరట్ల పసిడి ధర రూ.1,12,140, 22 కేరట్ల ధర రూ.1,02,790గా ఉంది. వెండి ధర కేజీ రూ.1,34,900 ఉంది. చెన్నైలో 24 కేరట్ల బంగారం ధర రూ.1,12,250డగా.. 22 కేరట్ల ధర రూ.1,02,890ఉంది. వెండి ధర కేజీ రూ.1,44,900 ఉంది. బెంగళూరులో 24 కేరట్ల ధర రూ.1,12,14022 క్యారెట్ల ధర రూ.1,02,790ఉంది. వెండి ధర కేజీ రూ.1,33,500 ఉంది. సాధారణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే.. దానికి అనుగుణంగా యూఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గి.. బంగారం ధర పెరుగుతుంటుంది. కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయింది. ఈ మార్పుకు స్టాక్ మార్కెట్లలో నెలకొన్న నెగెటివిటీ కారణం అని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

