AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక.. ఈపీఎఫ్ కనీస పింఛన్ రూ. 2500.. ఆ రోజే నిర్ణయం

ఇక.. ఈపీఎఫ్ కనీస పింఛన్ రూ. 2500.. ఆ రోజే నిర్ణయం

Phani CH
|

Updated on: Oct 09, 2025 | 8:28 PM

Share

ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ చందాదారులకు త్వరలో శుభవార్త రానుంది. కనీస పింఛను పెంపుకోసం పదకొండేళ్లుగా చూస్తున్న ఎదురుచూపులకు తెరపడనుంది. ఈ పింఛను పెంపుపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇస్తున్న కనీస పింఛను మొత్తాన్ని గణనీయంగా పెంచేందుకు కసరత్తు జరుగుతోంది.

ప్రస్తుతం ఉద్యోగుల పింఛను పథకం ఈపీఎస్-95 కింద నెలకు రూ. 1000 కనీస పింఛను అందుతోంది. 2014లో నిర్ణయించిన ఈ మొత్తంలో ఇప్పటివరకు ఎలాంటి మార్పు లేదు. అయితే, తాజాగా ఈ కనీస పింఛనును రూ. 2500కు పెంచేందుకు ఈపీఎఫ్ఓ సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు, ఉద్యోగ సంఘాలు మాత్రం పింఛనును నెలకు రూ. 7500కు పెంచాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నెల 10, 11 తేదీల్లో బెంగళూరులో జరగనున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో ఈ అంశం ప్రధాన ఎజెండాగా చర్చకు రానుంది. పింఛను పెంపుతో పాటు సంస్థ సేవలను డిజిటలైజ్ చేసే ‘ఈపీఎఫ్ఓ 3.0’ విధానం, ఇతర పరిపాలనా సంస్కరణలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. బెంగళూరు సమావేశంలో పింఛను పెంపునకు బోర్డు ఆమోదం తెలిపితే, తుది నిర్ణయం కోసం ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. కేంద్రం ఆమోద ముద్ర వేసిన తర్వాతే కొత్త పింఛను అమల్లోకి వస్తుంది. కాగా, కనీసం పదేళ్ల సర్వీసు పూర్తిచేసి 58 ఏళ్లు నిండిన ఉద్యోగులు ఈపీఎస్-95 కింద పింఛను పొందేందుకు అర్హులన్న విషయం తెలిసిందే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Today Gold Price: బంగారం ధరలు ఆగేదెప్పుడు ?? తులం ఎంతంటే ??

Thalapathy Vijay: ఓదార్పు యాత్ర చేయాలి.. పర్మిషన్ ప్లీజ్

గ్యాస్‌ సిలిండ‌ర్ల లారీని ఢీకొన్న పాల ట్యాంక‌ర్‌.. తర్వాత

గాజుల షాపులో నాగుపాము.. కస్టమర్ల పరుగో పరుగు

బట్టలుతుకుతున్న మహిళ.. హఠాత్తుగా మొసలి ఎంట్రీ.. ఆమెను నదిలోకి లాక్కెళ్లి