బట్టలుతుకుతున్న మహిళ.. హఠాత్తుగా మొసలి ఎంట్రీ.. ఆమెను నదిలోకి లాక్కెళ్లి
నీటిలో ఉండే మొసలి అత్యంత బలవంతమైంది. అది నీటిలో ఉన్నప్పుడు దాని బలం ముందు ఏనుగు కూడా సరితూగలేదని అందరికీ తెలిసిందే. నీటిలో ఉన్న మొసలికి చిక్కితే తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. మొసలి నోటికి ఒక్కసారి చిక్కితే.. ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. తాజాగా ఒడిశాలో షాకింగ్ ఘటన జరిగింది.
ఖరాస్రోటా నదీతీరం వద్ద ఓ మహిళపై అకస్మాత్తుగా దాడి చేసిన మొసలి ఆమెను నోట కరిచి నదిలోకి లాక్కెళ్లిపోయింది. జజ్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో మంగళవారం ఈ దారుణం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మహిళను కనుగొనేందుకు అటవీ శాఖ, అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. స్థానికంగా నివసించే 57 ఏళ్ల సౌదామినీ మహాలా దుస్తులు ఉతుక్కునేందుకు నదీ తీరానికి వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగింది. అకస్మాత్తుగా దాడి చేసిన మొసలి మహిళను నీటిలోకి లాగేసింది. చుట్టుపక్కల వారు స్పందించే లోపే బాధితురాలిని నీళ్లల్లోకి ఈడ్చుకెళ్లింది. రెప్పపాటులో ఈ దారుణం జరగిపోవడంతో చుట్టపక్కల వారికి ఆమెను కాపాడుకునే అవకాశమే లేకుండా పోయింది. ఈ దారుణాన్ని చూసి వారు నిస్సహాయంగా హాహాకారాలు చేశారు. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసారు. మహిళ భుజాన్ని నోట కరిచి నీళ్లల్లోకి వెళుతున్న మొసలి వీడియో ప్రస్తుతం నెట్టింట కలకలం రేపుతోంది. కొందరు ఆమెను కాపాడేందుకు నదిలో దూకినా ఫలితం లేకుండా పోయింది. సాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఈ ఘటనతో గ్రామస్థులు వణికిపోతున్నారు. నది సమీపానికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. కొన్ని నెలల క్రితం దాదాపు ఇలాంటి ఘటన జరిగిందని కొందరు గ్రామస్థులు తెలిపారు. నదీ తీరం వద్ద ఉన్న ఓ గొర్రెను మొసలి నీళ్లల్లోకి లాక్కెళ్లిపోయిందని అన్నారు. ఈ ఉదంతంపై అటవీ శాఖ అధికారులు కూడా స్పందించారు. నదీ తీరం వద్దకు వెళ్లొద్దని స్థానికులను హెచ్చరించారు. మొసలి సంచారం ఉన్నట్టు అనుమానాలున్న ప్రాంతాల్లో గస్తీ పెంచామని చెప్పారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Lalitha Jewellery: లలిత జువెలరీకి అరుదైన గౌరవం..
భారీ సెంచరీ చేసి సహచరుడిని కొట్టబోయిన పృథ్వీషా
కమ్ బ్యాక్ కోసం కుర్ర హీరోల తంటాలు
మొదలైన క్రిస్మస్ సినిమాల భారీ పోటీ.. గెలిచేది ఆ స్టార్ హీరోనేనా ??
ఆ భామ జాతకం మారేదేలే.. హిట్ కొట్టేదెలే.. పాపం ఈ ముద్దుగుమ్మ పరిస్థితి ఏంటి
నలభై ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపాలు.. ఎక్కడంటే
అయ్యో .. ఇలాంటి కష్టం ఎవరికీ రావద్దు
గుండెల్ని పిండేసే ఘటన.. అలా చేయడానికి మీకు మనసు ఎలా చేశారురా
చనిపోయిందనుకున్న కుమార్తె.. రెండు నెలల తర్వాత.. ట్విస్ట్ సూపర్
ఫ్రీ గ్యాస్ కనెక్షన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి !!
ప్రభుత్వం కొత్త యాప్.. రైతు బజార్ నుంచి ఇంటికే కూరగాయలు
జూ నుంచి తప్పించుకున్న సింహం.. ఎప్పుడొచ్చి మీద పడుతుందో.. టెన్షన్

