AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాజుల షాపులో నాగుపాము.. కస్టమర్ల పరుగో పరుగు

గాజుల షాపులో నాగుపాము.. కస్టమర్ల పరుగో పరుగు

Phani CH
|

Updated on: Oct 09, 2025 | 7:51 PM

Share

ఇటీవల పాములు ఎక్కడపడితే అక్కడ తిష్టవేస్తున్నాయి. ఇళ్లు , వాహనాలు, దుకాణాలు..ఇలా దేనినీ వదలడంలేదు. చీమలు పుట్టలు పెట్టడం మానేశాయో.. లేక వర్షాలు వరదలకు పుట్టలుకొట్టుకుపోవడంతో పాములకు ఆశ్రయం కరువైందో కానీ ఈ పాములు జనావాసాల్లోకి చేరి తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ గాజుల దుకాణంలో చేరిన నాగుపాము అక్కడకు వచ్చిన కస్టమర్స్‌ను పరుగులు పెట్టించింది.

విజయవాడ తిరువూరు పట్టణంలోని నీలం ఫ్యాన్సీ షాపులో గాజులు కొనేందుకు కొందరు మహిళలు వెళ్ళారు. అక్కడ దుకాణం యజమానిని గాజులు చూపించాలని కోరారు. దీంతో ఆ వ్యక్తి మహిళలకు గాజులు చూపిద్దామని షెల్ఫ్ లో ఉన్న గాజులను తీస్తుండగా… గాజులకు బదులు బుస్సుమంటూ ఓ ఆరడుగుల పాము ఒక్కసారిగా బయటకు వచ్చింది. దెబ్బకు షాక్‌ తిన్న యజమాని, గాజులు కొనేందుకు వచ్చిన మహిళలూ భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి గుమిగూడారు. వెంటనే కొందరు స్కేక్‌ క్యాచర్‌ ఉయ్యూరు జయప్రకాష్‌కు సమాచారమిచ్చారు. తక్షణం అక్కడికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ పామును పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. గాజులమాటును దాగున్న నాగుపామును బయటకు తీసేందుకు చాలా శ్రమ పడాల్సి వచ్చింది. ఎట్టకేలకు పామును బంధించి సంచిలో వేసుకొని తీసుకెళ్లి సమీపంలోని అడవిలో వదిలిపెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బట్టలుతుకుతున్న మహిళ.. హఠాత్తుగా మొసలి ఎంట్రీ.. ఆమెను నదిలోకి లాక్కెళ్లి

Lalitha Jewellery: లలిత జువెలరీకి అరుదైన గౌరవం..

భారీ సెంచరీ చేసి సహచరుడిని కొట్టబోయిన పృథ్వీషా

కమ్ బ్యాక్ కోసం కుర్ర హీరోల తంటాలు

మొదలైన క్రిస్మస్ సినిమాల భారీ పోటీ.. గెలిచేది ఆ స్టార్ హీరోనేనా ??