LIC పాలసీ ప్రీమియం కట్టలేకపోతున్నారా ?? ఇది మీకోసమే

Updated on: Jan 09, 2026 | 9:03 PM

ఆర్ధిక ఇబ్బందుల్లో బీమా పాలసీ ల్యాప్స్ కాకుండా, ఈపీఎఫ్ఓ కొత్త వెసులుబాటు కల్పించింది. పీఎఫ్ ఖాతా నుండి జీవిత బీమా ప్రీమియంలు చెల్లించవచ్చు. ఇది కేవలం ఉద్యోగి పేరు మీద ఉన్న ఎల్ఐసి పాలసీలకు, వార్షిక ప్రీమియంలకే వర్తిస్తుంది. ఫారం 14 నింపి, ఆన్‌లైన్‌లో లింక్ చేయాలి. రిటైర్మెంట్ పొదుపు తగ్గే అవకాశం ఉన్నందున, ఇది చివరి ఆశ్రయంగా మాత్రమే ఉపయోగించాలి.

జీవితంలో ఆర్థికంగా ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా బీమాను నిర్లక్ష్యం చేయకూడదనేది ఆర్థిక నిపుణులు చెబుతారు. మనకు ఎలాంటి ఆపద వచ్చినా కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేది బీమానే. అందుకే సకాలంలో ప్రీమియం చెల్లింపులు చేయడం చాలా అవసరం. కొన్నిసార్లు ఆ ప్రీమియం చెల్లించడానికి కూడా ఆర్థిక కష్టాలు ఎదురుకావొచ్చు. అలాంటి సందర్భంలో పీఎఫ్ ఖాతా నుంచి ప్రీమియం చెల్లించే వెసులుబాటు కల్పిస్తోంది ఈపీఎఫ్‌ఓ. తాత్కాలికంగా ఆర్థిక కష్టాలు ఎదురైనప్పుడు జీవిత బీమా పాలసీ ల్యాప్స్‌ కాకుండా ఈ ఆప్షన్‌ ఉపయోగపడుతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చిన ఈపీఎఫ్ స్కీమ్ ప్రకారం కొత్త పాలసీ కొనుగోలుకు, ప్రీమియం చెల్లింపులకు పీఎఫ్ ఖాతాలోని డబ్బులను ఉపయోగించుకోవచ్చు. యాక్టివ్ పీఎఫ్ అకౌంట్ ఉన్న వారు ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. అయితే, రెండు నెలల వేతనానికి సమానమైన నిల్వలు కలిగి ఉండాల్సి ఉంటుంది. అయితే, తీసుకునే ఎల్ఐసీ పాలసీ ఉద్యోగి పేరు మీదే ఉండాలి. జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరు మీద ఉన్న పాలసీ ప్రీమియంలు చెల్లించేందుకు వీలు ఉండదు. అలాగే వార్షిక ప్రీమియంలు చెల్లించేందుకు మాత్రమే ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇతర ప్రైవేట్ కంపెనీల్లో కొనుగోలు చేసిన ఇన్సూరెన్స్ ప్రీమియంలు చెల్లించడానికి ఇది అనుమతించదు. చెల్లించే వెసులుబాటు సైతం లేదు. పీఎఫ్ అకౌంట్ నుంచి ప్రీమియం చెల్లించే ఆప్షన్‌ను వినియోగించుకోవాలంటే ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ నుంచి ఫారం 14ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రక్రియను ప్రారంభించడానికి ఫారం-14 లోని వివరాలను నింపి సమర్పించాలి. EPFO వెబ్‌సైట్‌కి వెళ్లి మీ UAN, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వాలి. KYC విభాగానికి వెళ్లి LIC పాలసీని ఎంచుకొని, మీ LIC పాలసీ నంబర్, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయాలి. పాలసీ విజయవంతంగా లింక్ చేయబడిన తర్వాత, గడువు తేదీన ప్రీమియం మొత్తం మీ EPF ఖాతా నుండి డెబిట్‌ అవుతుంది. ప్రీమియం తేదీ మిస్ అవ్వకుండా పేమెంట్లు చేసేందుకు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ప్రీమియం చెల్లింపులకు బయట లోన్ తీసుకోవాల్సిన అవసరం తప్పుతుంది. అదే సమయంలో రిటైర్మెంట్ సేవింగ్స్ కోసం ఉద్దేశించిన పీఎఫ్ అకౌంట్లోని డబ్బులు తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకే ఇతర మార్గాల నుంచి చెల్లించలేఇని విధంగా ఆర్థిక కష్టాలు ఎదురైనప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ వినియోగించుకోవడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు

33 రోజుల్లో రికార్డ్స్ అవుట్.. అన్నీ అతడి హస్తగతం

Samantha: పెద్ద ప్లాన్ చేస్తున్న సమంత.. వర్కవుట్ అయితే రచ్చే

Kalki 2: కల్కి 2పై ఖతర్నాక్ కబురు.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే

సంక్రాంతి సినిమాల బిజినెస్ రూ.850 కోట్లు.. అంత స్టామినా ఉందా