జియో ఫ్రీ స్టోరేజ్‌ ఎఫెక్ట్‌.. గూగుల్‌, యాపిల్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌ ధరలు తగ్గేనా ??

జియో ఫ్రీ స్టోరేజ్‌ ఎఫెక్ట్‌.. గూగుల్‌, యాపిల్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌ ధరలు తగ్గేనా ??

Phani CH

|

Updated on: Sep 03, 2024 | 8:58 PM

జియో యూజర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ. దీపావళి నుంచి 100 జీబీ వరకూ క్లౌడ్‌ స్టోరేజీని వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద ఉచితంగా అందించనుంది జియో. దీంతో గూగుల్, యాపిల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యిందని విశ్లేషకులు అంటున్నారు. జియో ఎంట్రీతో క్లౌడ్ స్టోరేజ్‌ విభాగంలో గూగుల్‌ వన్‌, యాపిల్‌ ఐక్లౌడ్ సేవల ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

జియో యూజర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ. దీపావళి నుంచి 100 జీబీ వరకూ క్లౌడ్‌ స్టోరేజీని వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద ఉచితంగా అందించనుంది జియో. దీంతో గూగుల్, యాపిల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యిందని విశ్లేషకులు అంటున్నారు. జియో ఎంట్రీతో క్లౌడ్ స్టోరేజ్‌ విభాగంలో గూగుల్‌ వన్‌, యాపిల్‌ ఐక్లౌడ్ సేవల ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్‌, యాపిల్‌ యూజర్లు స్టోరేజ్‌ సమస్యను ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ఆండ్రాయిడ్‌ యూజర్లలో అధిక మంది గూగుల్‌ ఉచితంగా అందిస్తున్న 15జీబీ డేటా పరిమితికి చేరువయ్యారు. దీంతో వారు అదనపు స్టోరేజీ కోసం గూగుల్‌ వన్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రస్తుతం గూగుల్‌ వన్‌ 100జీబీ స్టోరేజీ ధర నెలకు రూ.130 ఉండగా.. ఐ క్లౌడ్‌ 50జీబీ స్టోరేజీ ధర రూ.75గా ఛార్జ్‌ వసూలు చేస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షూటింగ్‌ కారవాన్‌లలో సీక్రెట్‌ కెమెరాలు.. ప్రైవేట్‌ వీడియోలు

గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని అడవిలో 15 కి.మీ

అమెరికాలో చోరీకి వెళ్లి యువతిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి

న‌గ‌ల వ్యాపారిని బురిడీ కొట్టించబోయి .. చివ‌రికి అడ్డంగా ??

కిడ్నాపర్ వద్ద నుంచి వెళ్లనని మారాం చేసిన బాలుడు