కిడ్నాపర్ వద్ద నుంచి వెళ్లనని మారాం చేసిన బాలుడు

కిడ్నాపర్ చెర నుండి విడుదలైన ఓ బాలుడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లకుండా మారాం చేస్తూ ఏడుస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ కు చెందిన సస్పెండ్ అయిన రిజర్వ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తనూజ్ చాహర్ .. రాజస్థాన్ కు చెందిన పృధ్వీ అనే చంటిబిడ్డను నెలల ప్రాయంలోనే తల్లి నుండి దూరం చేసి ఎత్తుకెళ్లిపోయాడు.

కిడ్నాపర్ వద్ద నుంచి వెళ్లనని మారాం చేసిన బాలుడు

|

Updated on: Sep 03, 2024 | 8:51 PM

కిడ్నాపర్ చెర నుండి విడుదలైన ఓ బాలుడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లకుండా మారాం చేస్తూ ఏడుస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ కు చెందిన సస్పెండ్ అయిన రిజర్వ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తనూజ్ చాహర్ .. రాజస్థాన్ కు చెందిన పృధ్వీ అనే చంటిబిడ్డను నెలల ప్రాయంలోనే తల్లి నుండి దూరం చేసి ఎత్తుకెళ్లిపోయాడు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సెల్‌ఫోన్ వాడకుండా, ఎప్పటికప్పుడు వేషం మారుస్తూ వేర్వేరు ప్రాంతాల్లో బిడ్డను తిప్పాడు. అయితే కిడ్నాప్ అయిన ఆ చంటిబిడ్డ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. దాదాపు 14 నెలల తర్వాత అతను పోలీసులకు చిక్కాడు. ఇటీవలే తనూజ్ చాహర్‌ను అలీఘర్ లో అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. అయితే 14 నెలలుగా తనూజ్ చాహర్ వద్దే పెరగడంతో ఆ బాలుడు తల్లిదండ్రులను గుర్తించలేదు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలా ?? నెలకు రూ.10 వేలతో పెట్టుబడులు ప్రారంభించండిలా !!

కోతుల మధ్య గ్యాంగ్​ వార్ !! రెండు గ్రూపులుగా విడిపోయి దాడులు!!

Follow us