ఒక్కరోజే భారీగా పెరిగిన బంగారం తులం ఎంతంటే?
బంగారం ధర రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అమెరికా ఫెడరల్.. వడ్డీ రేట్ల ప్రభావంతో బంగారం ధర భారీగా పెరుగుతోంది. గత ఐదు రోజుల్లో తులం బంగారం ధర రూ.2,600 పెరగగా, వెండి ఏకంగా రూ. 8000 పెరిగి షాకిచ్చింది. నిజానికి..దీపావళి నాటికి బంగారం ధరలు పెరుగుతాయని గతంలో నిపుణులు అంచానా వేయగా.. అంతకు నెల ముందు నుంచే ధరలు భారీగా పెరగటంతో బంగారం కొనుగోలుదారులు షాకవుతున్నారు.
సెప్టెంబర్ 23, మంగళవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం 1,14,330 రూపాయలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం 1,04,800 రూపాయలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,48,100 రూపాయలుగా ఉంది. మరోవైపు.. ఢిల్లీలో 24 కేరట్ల పసిడి ధర రూ.1,14,290, 22 కేరట్ల ధర రూ.1,04,940 గా ఉంది. ముంబైలో 24 కేరట్ల పసిడి ధర రూ.1,114,330, 22 కేరట్ల ధర రూ.1,04,800గా ఉంది. చెన్నైలో 24 కేరట్ల బంగారం ధర రూ.1,14,330.. 22 కేరట్ల ధర రూ.1,04,800ఉంది. బెంగళూరులో 24 కేరట్ల ధర రూ.1,14,300, 22 క్యారెట్ల ధర రూ.1,04,800ఉంది. అటు..అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు సరికొత్త రికార్డ్ స్థాయికి దూసుకెళ్లాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఏకంగా 70 డాలర్లు పెరిగి 3752 డాలర్ల వద్దకు చేరుకుంది. ఇది ఆల్ టైం హై స్థాయిగా చెప్పవచ్చు. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 2.18 శాతం పెరిగి 44.03 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ లెక్కన ఇదే ఊపు కొనసాగితే.. బంగారం ధర రెట్టింపు కావటానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మో! సెప్టెంబర్ 25! ఏపీలో 6 రోజులు వర్షాలే
బ్యాగులో ప్రియురాలి శవాన్ని తీసుకెళ్తూ మధ్యలో సెల్ఫీ
ఫస్ట్ టైం విమానం ఎక్కాడు.. అనుకోకుండా బుక్కయ్యాడు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

