AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వచ్చే ఏడాది ఇంటర్ లో జాయిన్ అయ్యేవారికి గోల్డెన్ ఛాన్స్

వచ్చే ఏడాది ఇంటర్ లో జాయిన్ అయ్యేవారికి గోల్డెన్ ఛాన్స్

Phani CH
|

Updated on: Sep 23, 2025 | 5:13 PM

Share

భారత విద్యావ్యవస్థలో త్వరలో మార్పులు రాబోతున్నాయి. దండగమారి చదువులంటూ వస్తున్న విమర్శల్ని, ఉద్యోగాలకు తగిన నైపుణ్యం కల్గిన అభ్యర్థులు దొరకడంలేదన్న అసంతృప్తుల్ని తిప్పికొట్టే విధానం రాబోతుంది. త్వరలో 11-12వ తరగతుల పాఠ్యాంశాల్లో స్కిల్-బేస్డ్ లెర్నింగ్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది.

ఈ కొత్త విద్యా విధానం ద్వారా విద్యార్థులకు.. ఉద్యోగాలకు అవసరమైన ఆచరణాత్మక నైపుణ్యాలను అందించాలని, దేశ వృద్ధికి దోహదపడే మానవ వనరులను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రణాళిక ప్రకారం, రాష్ట్రీయ విద్యా భవన్ NCERT ద్వారా 11వ, 12వ తరగతుల సిలబస్‌లో స్కిల్ ఆధారిత మాడ్యూల్స్‌ను చేర్చనున్నారు. ఇందులో ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, హెల్త్‌కేర్, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి ఆధునిక రంగాల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. ‘విద్యార్థులు పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా, రియల్-వరల్డ్ స్కిల్స్‌తో సిద్ధమవ్వాలి.. ఇది భారత్‌ను గ్లోబల్ స్కిల్ హబ్‌గా మార్చుతుందని కేంద్ర విద్యా, నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపక శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ చర్య భారత్‌లో 50 శాతం కంటే ఎక్కువ మంది యువతకు ఉద్యోగాలు అందించడం, స్కిల్ ఇండియా మిషన్‌కు అనుగుణంగా పనిచేయడం వంటి లక్ష్యాలను సాధించడానికి దోహదపడుతుందని అధికారులు అంటున్నారు. 2026-27 అకడమిక్ ఇయర్ నుంచి ఈ మార్పులు అమలులోకి వస్తాయని, రాష్ట్రాలతో కలిసి పైలట్ ప్రాజెక్ట్‌లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ ప్రయత్నం ద్వారా విద్యా వ్యవస్థను మరింత ప్రయోజనకరంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓజీ క్రేజ్‌.. జనసేన ఖజానాకు విరాళాలు

దేశమంతా 9 రోజులు.. అక్కడ మాత్రం ఒక్కరోజే దసరా

కొబ్బరిబోండాల లారీ బోల్తా.. సంచులతో ఎగబడిన జనం

దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన జీఎస్టీ 2.o.. ఏ వస్తువుల ధరలు ఎంతెంత అంటే..

విమానంలో ఎలుక.. కేకలు పెట్టిన ప్రయాణికులు