AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశమంతా 9 రోజులు.. అక్కడ మాత్రం ఒక్కరోజే దసరా

దేశమంతా 9 రోజులు.. అక్కడ మాత్రం ఒక్కరోజే దసరా

Phani CH
|

Updated on: Sep 23, 2025 | 4:44 PM

Share

దసరా అంటే 9 రోజులపాటు అమ్మవారిని వివిధ రూపాల్లో భక్తులు పూజిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోనే కాకుండా వాడవాడలా దుర్గా మండపాలను ఏర్పాటు చేసి తొమ్మిదిరోజులపాటు రోజుకో అలంకారంతో అమ్మవారిని ఆరాధిస్తారు. పదవరోజు విజయదశమిగా పండుగ జరుపుకొని అమ్మవారిని పదకొండవ రోజున నిమజ్జనం చేస్తారు. కానీ పశ్చిమ బెంగాల్‌లోని ఓ గ్రామంలో మాత్రం దసరా ఒక్కరోజే నిర్వహిస్తారు.

ఆ ఒక్క రోజులోనే 9 రకాల పూజలను చేస్తారు. తరతరాలుగా ఇది అక్కడి సంప్రదాయంగా ఉంది. పశ్చిమ బెంగాల్ లోని అసన్‌సోల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని.. ధేనువా గ్రామంలోని కాళీకృష్ణ ఆశ్రమంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవ పూజను ఒకరోజు మాత్రమే చేయటం ఆనవాయితీ. ఈ అరుదైన సంప్రదాయాన్ని తేజానంద బ్రహ్మచారి అనే సన్యాసి ప్రారంభించారు. అక్కడి దామోదర్ నదీ తీరాన కాళీకృష్ణ ఆశ్రమాన్ని స్థాపించిన ఆయనకు.. 1979లో అమ్మవారు కలలో కనిపించి నవరాత్రి పూజలను ఒకే రోజు చేయాలని సూచించారట. దీంతో నాటి నుంచి మహాలయ అమావాస్య రోజే.. అమ్మవారి సప్తమి, అష్టమి, నవమి, దశమి పూజలన్నీ కలిపి అమావాస్య నాడే చేసే సంప్రదాయం ప్రారంభమైంది. ఈ పూజలలో భాగంగా తొమ్మిది రకాల పవిత్ర పత్రాలతో తయారైన నవపత్రికకు జలాభిషేకం చేసి, అమ్మవారి విగ్రహం ముందు ఉంచుతారు. ప్రత్యేకంగా జయ, విజయలతో కూడిన అమ్మవారి విగ్రహం మాత్రమే ఇక్కడ ప్రతిష్ఠించి పూజిస్తారు. పూజలు పూర్తయిన తర్వాత, నవపత్రికను నదిలో నిమజ్జనం చేస్తారు. విగ్రహం మాత్రం భక్తుల దర్శనార్థం అక్కడే ఉంచుతారు, కానీ ఎలాంటి పూజలు నిర్వహించరు. ఈ ప్రత్యేక ఉత్సవాన్ని చూడటానికి స్థానికులే కాకుండా చుట్టుపక్కల జిల్లాలనుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొబ్బరిబోండాల లారీ బోల్తా.. సంచులతో ఎగబడిన జనం

దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన జీఎస్టీ 2.o.. ఏ వస్తువుల ధరలు ఎంతెంత అంటే..

విమానంలో ఎలుక.. కేకలు పెట్టిన ప్రయాణికులు

సూర్యుడిని రెండుగా చీలుస్తూ నింగికి ఎగిసిన ఫాల్కన్‌.. అదిరిపోయే ఫొటోను చూసారా