Amazon: అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. ఫ్లిప్‌కార్ట్‌, మీషోకు పోటీ?

Amazon: అమెజాన్ ‘బజార్’ వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. ఫ్లిప్‌కార్ట్‌, మీషోకు పోటీ?

Subhash Goud

|

Updated on: Apr 17, 2024 | 3:56 PM

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. అన్ బ్రాండెడ్, తక్కువ ధర కలిగిన ఫ్యాషన్, లైఫ్ స్టైల్ ఉత్పత్తులను విక్రయిస్తామని తెలిపింది. ఇందుకోసం అమెజాన్ బజార్ పేరిట కొత్త వెబ్‌సైట్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ బజార్ అమెజాన్ ఆండ్రాయిడ్ యాప్‌లో లైవ్ లోకి వచ్చింది. రూ.600 లోపు విలువ కలిగిన దుస్తులు, వాచ్‌లు, ఫుట్‌వేర్ వంటివి అందించడమే లక్ష్యంగా కొత్త వ్యాపార విభాగాన్ని

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. అన్ బ్రాండెడ్, తక్కువ ధర కలిగిన ఫ్యాషన్, లైఫ్ స్టైల్ ఉత్పత్తులను విక్రయిస్తామని తెలిపింది. ఇందుకోసం అమెజాన్ బజార్ పేరిట కొత్త వెబ్‌సైట్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ బజార్ అమెజాన్ ఆండ్రాయిడ్ యాప్‌లో లైవ్ లోకి వచ్చింది. రూ.600 లోపు విలువ కలిగిన దుస్తులు, వాచ్‌లు, ఫుట్‌వేర్ వంటివి అందించడమే లక్ష్యంగా కొత్త వ్యాపార విభాగాన్ని ప్రారంభించినట్లు అమెజాన్ తెలిపింది. కొనుగోలు చేసిన 4-5 రోజుల్లో డెలివరీ చేయనున్నట్లు పేర్కొంది.

తక్కువ ధరకే ఫ్యాషన్, హోమ్ అప్లియన్సెస్ వంటివి అందించడం ఈ అమెజాన్ బజార్ ప్రధాన ఉద్దేశం. చీరలు, షర్టులు, చిన్న పిల్లల దుస్తులు, బెడ్ షీట్లు, డోర్ కర్టేన్స్, హ్యాండ్ బ్యాకుల వంటి చాలా రకాల ఉత్పత్తులు ఈ అమెజాన్ బజార్ స్టోర్‌లో లభించనున్నాయి. దేశంలోని నలుమూలలా నుంచి మాన్యుఫాక్చరింగ్ హబ్స్ ద్వారా సెల్లర్లు తమ ఉత్పత్తులను ఈ బజార్ లో విక్రయించుకోవచ్చని అమెజాన్ తెలిపింది. ఇందు కోసం సెల్లర్ల నుంచి ఎలాంటి ఫీజూ వసూలు చేయడం లేదని తెలిపింది. అయితే, వీటి డెలివరీకి 4-5 రోజుల సమయం పడుతుందని పేర్కొంది. సాధారణంగా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకు ఒకే రోజులో డెలివరీ చేస్తుంది. అయితే, అన్ బ్రాండెడ్ ఉత్పత్తుల విషయంలో ఎక్కువ సమయం పడుతుందని అర్థమవుతోంది.