Loan Frauds: లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్ అస్త్రం..ఆర్బీఐ కీలక నిర్ణయం
దేశంలో అక్రమ రుణాలు ఇచ్చే యాప్‌లు వేగంగా పెరుగుతున్నాయి. వీటి కారణంగా సైబర్ మోసాల కేసులు కూడా పెరిగాయి. ఈ యాప్‌లు మీ డేటాను సైబర్ దుండగులకు విక్రయిస్తున్నాయి. ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును సైబర్ మోసాల బారిన పడి కొద్ది నిమిషాల్లోనే పోగొట్టుకుంటున్నారు. ఈ యాప్‌లు నకిలీ క్లెయిమ్‌లు, వాగ్దానాలతో ప్రజలను ఆకర్షిస్తాయి. తరువాత, భారీగా వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి.
దేశంలో అక్రమ రుణాలు ఇచ్చే యాప్‌లు వేగంగా పెరుగుతున్నాయి. వీటి కారణంగా సైబర్ మోసాల కేసులు కూడా పెరిగాయి. ఈ యాప్‌లు మీ డేటాను సైబర్ దుండగులకు విక్రయిస్తున్నాయి. ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును సైబర్ మోసాల బారిన పడి కొద్ది నిమిషాల్లోనే పోగొట్టుకుంటున్నారు. ఈ యాప్‌లు నకిలీ క్లెయిమ్‌లు, వాగ్దానాలతో ప్రజలను ఆకర్షిస్తాయి. తరువాత, భారీగా వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. లోన్ ఇచ్చేటప్పుడే.. అప్పు తీసుకున్నవారి ఫోన్ లో ఫోటో గ్యాలరీ , కాంటాక్ట్ లిస్ట్‌కి యాక్సెస్ తీసుకుంటారు. రుణాన్ని సకాలంలో చెల్లించకపోతే, ఈ యాప్‌లు బెదిరింపు మెసేజ్ లు, కాల్స్, ఈమెయిల్‌లు పంపుతాయి. వ్యక్తుల ఫోటోలు తారుమారు చేస్తారు. వాటిని కాంటాక్ట్ లిస్ట్‌లోని వ్యక్తులతో షేర్ చేయమని బెదిరిస్తారు. ఇలా చాలామందిని వేధిస్తున్నారు. సైబర్ మోసాలను అరికట్టేందుకు ఆర్‌బీఐ నిరంతరాయంగా ప్రయత్నిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలు ఏమాత్రం సరిపోవడం లేదు . అటువంటి రుణాలు ఇస్తున్న కంపెనీల జాబితాను రిజర్వ్ బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో షేర్ చేసుకుంది. Google Play Store లో అటువంటి అనేక యాప్‌లను కూడా తొలగించింది. అయితే ఒక యాప్‌ను నిషేధించిన వెంటనే అలాంటి మరో మూడు యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. అందుకే RBI ఇప్పుడు డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ లేదా DIGITA ఏర్పాటు చేస్తోంది. మరి లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టే ఆ డిజిటల్ అస్త్రం ఏంటో తెలుసుకుందాం.