Watch Video: శ్రీశైలం ఘాట్ రోడ్లో ప్రమాదం.. లోయలో పడిన వాహనం..15 మందికి గాయాలు
నంద్యాల జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులోని ఆంజనేయస్వామి గుడి సమీపంలో బొలోరా వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. ఘాట్ రోడ్డులోని పెద్ద మలుపులు ఉండటంతో వాహనం కంట్రోల్ కాకపోవడంతో అదుపుతప్పి లోయలోకి పడిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. లోయలోకి పడిన వాహనం చెట్టుకు ఢీకోట్టి ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
నంద్యాల జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులోని ఆంజనేయస్వామి గుడి సమీపంలో బొలోరా వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. ఘాట్ రోడ్డులోని పెద్ద మలుపులు ఉండటంతో వాహనం కంట్రోల్ కాకపోవడంతో అదుపుతప్పి లోయలోకి పడిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. లోయలోకి పడిన వాహనం చెట్టుకు ఢీకోట్టి ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామానికి చెందిన యాత్రికులు శ్రీశైలంలో స్వామిఅమ్మవార్ల దర్శనానికి వెళ్లి వస్తున్న సమయంలో శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో యాత్రికులు బయటపడ్డారు. గాయాలపాలైన క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీశైలం సమీపంలోని ఘాడ్ రోడ్డులో సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న దోర్నాల మండలం పోలీసులు ఘటన స్దలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

