Car Driving: రాత్రివేళ కారులో వెళ్తున్న దంపతులు.. సడన్ గా ఒక్కసారిగా షాక్.. ఇలాంటి చిల్లర పనులు మానుకోండి అంటూ..

రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వెంటాడుతుందో తెలియదు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. బెంగళూరు రోడ్డుపై తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో

Car Driving: రాత్రివేళ కారులో వెళ్తున్న దంపతులు.. సడన్ గా ఒక్కసారిగా షాక్.. ఇలాంటి చిల్లర పనులు మానుకోండి అంటూ..

|

Updated on: Feb 06, 2023 | 8:51 AM

రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వెంటాడుతుందో తెలియదు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. బెంగళూరు రోడ్డుపై తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఓ జంట తమ కారులో ప్రయాణిస్తోంది. ఒంటరిగా కారులో వెళ్తున్న ఈ జంటను ఇద్దరు బైకర్లు వెంబడించారు. అంతేకాదు వారి కారును ఢీకొట్టారు కూడా. ఈ దారుణ ఘటన అంతా ఆ కారులోని డ్యాష్‌బోర్డ్ కెమెరాలో రికార్డయింది. అదికాస్తా నెట్టింట చేరి వైరల్‌గా మారింది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఇద్దరు యువకులు రోడ్డుకు వ్యతిరేక దిశలో బైక్‌పైన వస్తూ కారును ఢీకొట్టారు. అనంతరం కారులో ఉన్న దంపతులను బెదిరించేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన ఆ కారులోని వ్యక్తి తన కారును వెనక్కి తీసుకున్నాడు. అయినా ఆ యువకుడు కారును వెంబడించి కారు విండో తెరవడానికి ప్రయత్నించాడు. అలా దాదాపు 5 కిలోమీటర్ల మేర కారును వెంబడించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్ కావడంతో స్థానికంగా కలకలం రేగింది. వైరల్‌ అయిన ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన బెంగళూరు పోలీసులు వెంటనే ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అంతేకాదు, రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు పౌరులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ జంటకు జరిగినది మీకు జరగకుండా జాగ్రత్త వహించండి అంటూ సూచించారు. రాత్రి ప్రయాణంలో కారు డోర్ తెరవకండి. డ్రైవింగ్ చేసేటప్పుడు పౌరులు తప్పనిసరిగా డ్యాష్‌బోర్డ్ కెమెరాను ఉపయోగించాలని కోరుతున్నారు పోలీసులు, ఉన్నతాధికారులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Follow us