AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coffee Benefits: తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి హెన్నా అవసరం లేదు.. ఈ ఒక్కటి చాలు..!

Coffee Benefits: తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి హెన్నా అవసరం లేదు.. ఈ ఒక్కటి చాలు..!

Anil kumar poka
|

Updated on: Mar 19, 2024 | 11:27 AM

Share

తెల్లజుట్టును నల్లగా మార్చేందుకు రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను వాడుతుంటారు. కానీ ఈ రకమైన ఉత్పత్తులు మీ జుట్టును తాత్కాలికంగా నల్లగా చేసే రసాయనాలను ఉపయోగిస్తాయని, అవి దీర్ఘకాలంలో తీరని నష్టాన్ని కలిగిస్తాయని మీకు తెలుసా? అందుకే సహజసిద్ధంగా జుట్టును నల్లగా మార్చుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. అందుకు ఒక మంచి రెసిపీని కూడా సూచించారు.

తెల్లజుట్టును నల్లగా మార్చేందుకు రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను వాడుతుంటారు. కానీ ఈ రకమైన ఉత్పత్తులు మీ జుట్టును తాత్కాలికంగా నల్లగా చేసే రసాయనాలను ఉపయోగిస్తాయని, అవి దీర్ఘకాలంలో తీరని నష్టాన్ని కలిగిస్తాయని మీకు తెలుసా? అందుకే సహజసిద్ధంగా జుట్టును నల్లగా మార్చుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. అందుకు ఒక మంచి రెసిపీని కూడా సూచించారు. దానికోసం పెద్దగా కష్టపడనక్కర్లేదు కూడా. మన వంటింట్లో ఎప్పుడూ రెడీగా ఉండేదే.. అదే కాఫీపొడి. అవును, ఇది తెల్లజుట్టును నల్లగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం. సహజంగా తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి కాఫీ నుండి రంగును తయారు చేసుకోవచ్చు. దీని కోసం, రెండు పెద్ద చెంచాల కాఫీ పొడి, ఒక కప్పు కండీషనర్ తీసుకోండి. ఈ రెండింటినీ బాగా కలపండి. తర్వాత ఆ పేస్ట్‌ని జుట్టుకు బాగా పట్టించి గంటపాటు అలాగే ఉంచాలి. అప్పుడు మీ జుట్టును నీటితో మాత్రమే కడగాలి. షాంపూ వాడకూడదు. అలాగే మరో విధానంలో కాఫీపొడి తీసుకొని అందులో అలోవెరా జెల్ కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని జుట్టుకు పట్టించి గంటపాటు అలాగే ఉంచాలి. తర్వాత మీ జుట్టును సాధారణ నీటితో కడగాలి.

ఇప్పుడు కూడా షాంపూ ఏమాత్రం ఉపయోగించకూడదు. కాఫీ తెల్లని జుట్టును నల్లగా మార్చడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది హెన్నా కంటే ఎక్కువ ప్రయోజనకరం. కాఫీ మీ జుట్టుకు సహజంగా పోషణను అందిస్తుంది, ఇది జుట్టుకు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. బ్రౌన్ కలర్ జుట్టు సహజంగా కూల్ గా కనబడేలా చేస్తుంది. కాఫీపొడితో మీ జుట్టు చక్కని మెరుపు సంతరించుకుంటుంది. కాఫీ లోపలి నుండి జుట్టుకు మెరుపు తెచ్చేలా పనిచేస్తుంది. దీనితో పాటు, ఇది తలలో కొల్లాజెన్‌ను పెంచుతుంది. కాబట్టి మెరిసే జుట్టు కావాలంటే కాఫీని ఇలా వాడండి. అంతేకాదు, కాఫీ జుట్టుకి మంచి కండీషనర్ కూడా. మీ జుట్టు లోపలి నుండి తేమగా ఉండేలా కాఫీ పనిచేస్తుంది. కాఫీలోని గుణాలు మీ జుట్టును సహజంగా సిల్కీగా చేస్తాయి. ఈ సూచనలు అన్నీ కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే.. వీటిని ప్రయోగించేముందు నిపుణుల సలహాకూడా తీసుకుంటే మంచిది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..