అయోధ్య హిందూత్వ రాజధాని TV9 కాంక్లేవ్‌ను ప్రారంభించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి.. వీడియో..
అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనున్న తరుణంలో దేశమంతటా ఆధ్యాత్మిక భావాలు ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు మీడియా చరిత్రలోనే అపురూప ఘట్టంగా రామమందిర నమూనాను టీవీ9 ఆవిష్కరించింది. ఆరంభానికి ముందే రామాలయాన్ని ప్రేక్షకుల ముందుంచింది.

జనవరి 22న అయోధ్యలో దివ్య, భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో టీవీ9 మండల దీక్షలా 40 రోజులుగా శ్రీరాముడిపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తోంది. రామభక్తి ధారలో ఓలలాడేలా కథనాలు అందిస్తూ ప్రేక్షకులను పరవశింప చేస్తోంది.
శ్రీరామ సప్తాహంలో భాగంగా అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్టకు ముందే రామాలయాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరింపచేసింది టీవీ9. రామమందిర నమూనాను టీవీ9 తన స్టూడియోలో ఆవిష్కరించింది. నిపుణులు వ్యయప్రయాసలకోర్చి రామ మందిర రెప్లికాను రూపొందించి అద్భుతంగా తీర్చిదిద్దారు.
టీవీ9 స్టూడియో మొత్తం రామమయమైంది. అణువణువునా రాముడు నిండిపోయాడు. సీతారామలక్ష్మణ హనుమంతులు టీవీ9 స్టూడియోలో కొలువు తీరారు.
విశ్వహిందూ సమాజాన్ని ఏకం చేస్తున్న రాయాలయ ప్రారంభోత్సవ వేళ టీవీ9 కూడా రామభక్తిలో తన్మయత్వం పొందుతూ అయోధ్య హిందూత్వ రాజధాని పేరిట ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్తలతో కాంక్లేవ్ నిర్వహించింది.
రాయాలయ ప్రారంభోత్సవ వేళ టీవీ9 నిర్వహించిన అయోధ్య హిందూత్వ రాజధాని కాంక్లేవ్ ను శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి మంగళాశాసనం ద్వారా ప్రారంభించారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..