కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం: అసదుద్దీన్ ఓవైసీ

|

Nov 23, 2023 | 6:53 PM

కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. గత తొమ్మిదిన్నరేళ్లలో ఒక్కసారి కూడా అల్లర్లు జరగలేదని.. రాష్ట్రంలో శాంతి భద్రతలు, అభివృద్ది మరింతగా మెరుగుపడ్డాయన్నారు. రాష్ట్ర అభివృద్దిని అంతా చూస్తున్నారు.

కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం: అసదుద్దీన్ ఓవైసీ
Mp Asaduddin Owaisi
Follow us on

కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. గత తొమ్మిదిన్నరేళ్లలో ఒక్కసారి కూడా అల్లర్లు జరగలేదని.. రాష్ట్రంలో శాంతి భద్రతలు, అభివృద్ది మరింతగా మెరుగుపడ్డాయన్నారు. రాష్ట్ర అభివృద్దిని అంతా చూస్తున్నారు. ఎస్‌ఆర్‌డీపీ నిధులతో రోడ్ల విస్తరణ, నాలాల అభివృద్ధి, ప్రతీ నియోజకవర్గంలో రూ.250 కోట్లతో అభివృద్ది పనులు.. అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు.. ఇలా ఒకటేమిటి అందరికీ అభివృద్ధి కళ్లకు కనిపిస్తోందని చెప్పారు ఓవైసీ. తాము హిందువులకి వ్యతిరేకంగా ఒక్కమాట మాట్లాడలేదన్నారు. రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీలకు రూ. 2,200 కోట్ల బడ్జెట్‌ కేటాయించిందని.. ఆర్టికల్ 15 ప్రకారమే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. అక్బరుద్దీన్ సభలో 5 నిమిషాల ముందే పోలీసులు ఒత్తిడి చేశారని.. సమయం దాటాక ప్రచారం చేస్తే కేసులు పెట్టమన్నామని అసదుద్దీన్ పేర్కొన్నారు. ఆ ఇన్‌స్పెక్టర్ ప్రవర్తనపై తమ దగ్గర వీడియోలున్నాయని తెలిపారు.