Cyclone Alert: దూసుకొస్తున్న మరో తుఫాన్‌ వాతావరణశాఖ పిడుగులాంటి వార్త

Updated on: Nov 21, 2025 | 12:50 PM

వాతావరణ శాఖ మరో తుఫాన్ హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో నవంబర్ 22న అల్పపీడనం ఏర్పడి 24న వాయుగుండంగా మారనుంది. తదుపరి 48 గంటల్లో ఇది తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉంది. నవంబర్ 26 నుండి 29 వరకు కోస్తా ఆంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మొంథా తుఫాన్‌ సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోక ముందే మరో బాంబు పేల్చింది వాతావరణ శాఖ. మరో తుఫాన్‌ ముంచుకొస్తుందని పిడుగులాంటి వార్త చెప్పింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నవంబర్ 22న ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి నవంబర్ 24 నాటికి దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగాలలో వాయుగుండంగా బలపడనుంది. ఆపై పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, తదుపరి 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా మారి.. ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో నవంబర్ 26 నుంచి 29 మధ్య కాలంలో తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 26వ తేదీన ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు… 27, 28 తేదీల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 29న ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 30వ తేదీన కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇక శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కృష్ణా, బాపట్ల, జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శివయ్య కోసం వందల సంఖ్యలో తరలి వచ్చిన పాములు.. హర హర మహాదేవ..

బర్గర్ తిని వ్యక్తి మృతి.. ఏం తినాలన్న భామేస్తుందిరా అయ్యా..

ఒక ‘పిల్లి’.. ఆ నగరాన్నే కదిలించింది..

ఉద్యోగులపై నిఘా !! 5 నిమిషాల పాటు మౌస్‌ ను ముట్టుకోకుంటే !!

కళకు హద్దుల్లేవ్.. నా మనసులో ద్వేషం లేదు