ఎలుగుబంటి దివ్యకి పోస్ట్ మార్టం !! కన్నీటిపర్యంతమైన జూ సిబ్బంది

|

Nov 03, 2023 | 9:00 PM

విశాఖ లోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శన శాల లో విషాదం చోటు చేసుకుంది. ఇదే జూ లో పుట్టి 20 ఏళ్ల పాటు అందరినీ అలరించిన ఎల్గుబంటి దివ్య మృతి చెందింది. ఇటీవల కాలంలో దివ్య అనారోగ్యం పాలైంది. జూ వెటర్నరీ సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించగా కిడ్నీ సంబంధిత వ్యాధి గా నిర్దారణ అయింది. అయినప్పటికీ తగిన వైద్య చికిత్స లను అందించడం తో పాటు అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు జూ సిబ్బంది. పరిస్థితి విషమించడంతో ఎలుగుబంటి మృతి చెందింది.

విశాఖ లోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శన శాల లో విషాదం చోటు చేసుకుంది. ఇదే జూ లో పుట్టి 20 ఏళ్ల పాటు అందరినీ అలరించిన ఎల్గుబంటి దివ్య మృతి చెందింది. ఇటీవల కాలంలో దివ్య అనారోగ్యం పాలైంది. జూ వెటర్నరీ సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించగా కిడ్నీ సంబంధిత వ్యాధి గా నిర్దారణ అయింది. అయినప్పటికీ తగిన వైద్య చికిత్స లను అందించడం తో పాటు అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు జూ సిబ్బంది. పరిస్థితి విషమించడంతో ఎలుగుబంటి మృతి చెందింది. ఎలుగుబంటి దివ్య మరణంతో జూ సిబ్బంది కన్నీటిపర్యంతమయ్యారు. 2003 లో విశాఖ జూ లో నే జన్మించిన ఎలుగుబంటి 20 ఏళ్లుగా ఇక్కడి సిబ్బందితో ఎంతో స్నేహంగా ఉండేది. జూలో ఎంతో చలాకీగా తిరుగుతూ సందర్శకులను అలరించేది. పర్యాటకులకు ఇది కేవలం ఒక జంతువు మాత్రమే..కానీ తమకు మాత్రం కుటుంబ సభ్యులలో ఒకరు మరణించినట్లు గా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు జూ సిబ్బంది. ఎలుగుబంటి మృతకళేబరానికి పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించారు. ఈ పోస్ట్ మార్టం లో కేవలం కిడ్నీ సంబంధిత వ్యాధి తీవ్రత వల్లే మృతి చెందినట్టు, ఇతర అనారోగ్య కారణాలు ఏవీ లేవని వైద్యులు నిర్ధారించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి కేసీఆర్‌.. ఇదో సెంటిమెంట్‌ ??

టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానానికి అడ్డంగా వెళ్లిన మహిళ !!

TOP 9 ET News: వామ్మో.. పెళ్లి ఖర్చు..మరీ అన్ని కోట్లా | అమ్మో.. 135 కోట్లు.. ఆగని డబ్బుల లెక్క

ఆ ఊరికి దెయ్యం భయం… ఖాళీ చేసి వెళ్లిపోయిన జనం

బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే పియానో వాయించాడు

 

 

 

Follow us on