విశాఖ పట్నమా.. పాముల పట్నమా ?? వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు !!

విశాఖ పట్నమా.. పాముల పట్నమా ?? వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు !!

Phani CH

|

Updated on: Nov 03, 2023 | 9:54 PM

పాములంటే సాధారణంగా అందరికీ భయమే. పాము పేరు చెబితేనే ఆమడ దూరం పరిగెడతారు కొందరు.. ఇక పామును దగ్గరగా చూస్తే గజగజా వణుకుతారు కొందరు. అలాంటిది గుట్టలు గుట్టలుగా పాములు కనబడితే.. అడుగడుగునా పాములు దర్శనమిస్తుంటే వారి పరిస్థితి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం విశాఖవాసుల పరిస్థితి ఇదే. నాగుపాములు, జెర్రిగొడ్లు, కొండచిలువలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో స్థానిక స్నేక్‌ క్యాచర్‌కు ఫోనులే ఫోనులు.

పాములంటే సాధారణంగా అందరికీ భయమే. పాము పేరు చెబితేనే ఆమడ దూరం పరిగెడతారు కొందరు.. ఇక పామును దగ్గరగా చూస్తే గజగజా వణుకుతారు కొందరు. అలాంటిది గుట్టలు గుట్టలుగా పాములు కనబడితే.. అడుగడుగునా పాములు దర్శనమిస్తుంటే వారి పరిస్థితి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం విశాఖవాసుల పరిస్థితి ఇదే. నాగుపాములు, జెర్రిగొడ్లు, కొండచిలువలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో స్థానిక స్నేక్‌ క్యాచర్‌కు ఫోనులే ఫోనులు. కేవలం వారం రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో పాములను పట్టుకుని బంధించారు స్నేక్‌ సేవ సొసైటీ కిర్‌ణ్‌ అండ్‌ టీమ్‌. అనంతరం వాటిని సురక్షితంగా అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ టౌన్షిప్, మధురవాడ, ఎండాడ, గాజువాక, కూర్మన్నపాలెం తో పాటు.. వేర్వేరు చోట్ల ఇళ్లల్లో చొరబడుడతున్నాయి విష సర్పాలు. బాత్రూముల్లోనూ, ఏసీలోను, కిచెన్లోనూ, ఎక్కడ వాటికి అనువుగా అనిపిస్తే అక్కడ చేరిపోతున్నాయి పాములు. చిన్న చిన్న పాములే కాదు, ఏకంగా భారీ కొండచిలువలు కూడా జనవాసాల్లోకి చొరబడుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా కొండవాలు ప్రాంతాలు, చెట్లు, పొదలు ఎక్కువగా ఉన్నచోట్ల ఇళ్లలో వచ్చి చేరుతున్నాయి ఈ పాములు. ఇలా పాములు చెలరేగిపోతుండటంతో విశాఖలో స్నేక్స్ సేవర్ సొసైటీ టీంకి చేతినిండా పనిపడుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎలుగుబంటి దివ్యకి పోస్ట్ మార్టం !! కన్నీటిపర్యంతమైన జూ సిబ్బంది

కొనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి కేసీఆర్‌.. ఇదో సెంటిమెంట్‌ ??

టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానానికి అడ్డంగా వెళ్లిన మహిళ !!

TOP 9 ET News: వామ్మో.. పెళ్లి ఖర్చు..మరీ అన్ని కోట్లా | అమ్మో.. 135 కోట్లు.. ఆగని డబ్బుల లెక్క

ఆ ఊరికి దెయ్యం భయం… ఖాళీ చేసి వెళ్లిపోయిన జనం