Ayodhya: అయోధ్యలో అక్షత పూజ.. దేశంలో ప్రతి ఇంటికీ అక్షింతలు

Updated on: Nov 06, 2023 | 9:47 PM

అయోధ్యలో భవ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను ప్రారంభించారు ట్రస్టు సభ్యులు. ఆలయంలోని ప్రధాన ద్వారం వద్ద అక్షత పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆలయంలో అక్షత పూజ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను ప్రారంభించారు ట్రస్టు సభ్యులు. ఈ అక్షతలను దేశవ్యాప్తంగా పంపిణీ చేసి ప్రజలను ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించనున్నట్లు తెలిపారు.

అయోధ్యలో భవ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను ప్రారంభించారు ట్రస్టు సభ్యులు. ఆలయంలోని ప్రధాన ద్వారం వద్ద అక్షత పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆలయంలో అక్షత పూజ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను ప్రారంభించారు ట్రస్టు సభ్యులు. ఈ అక్షతలను దేశవ్యాప్తంగా పంపిణీ చేసి ప్రజలను ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 100 క్వింటాళ్ల బియ్యం, పసుపు, నెయ్యిని ఉపయోగించినట్లు ట్రస్ట్ తెలిపింది. విశ్వ హిందూ పరిషత్​, ఆర్​ఎస్​ఎస్​కు చెందిన సుమారు 250 మంది కార్యకర్తలు కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు వెళ్లి వీటిని పంపిణీ చేయనున్నారు. దేశంలోని ప్రతి ఇంటికి అక్షతలను పంపిణీ చేసి ప్రాణ ప్రతిష్ఠకు రావాలని ఆహ్వానించనున్నారు. రామజన్మభూమి ప్రాంతంలోని ప్రధాన ద్వారం వద్ద పూజలు నిర్వహించిన తరువాత.. కార్యకర్తలకు అక్షత కలశాలను అందించారు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్​. ఇప్పటికే అయోధ్య నుంచి బయలుదేరిన కార్యకర్తలు.. గ్రామాల్లోని ఆలయాల్లో పూజలు నిర్వహించి ప్రజలకు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గాజుల రామారంలో ఘనంగా పల్లకీ సేవ.. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు

రివర్స్‌లో ఆటో నడిపి ఆకట్టుకున్న యువకుడు !! ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

విజయవాడ బస్సు ప్రమాదానికి ప్రాథమిక కారణాలు ఇవే

వెయ్యి రూపాయల కోసం హోర్డింగ్‌ ఎక్కి యువకుడి హల్‌చల్‌

Varun Tej-Lavanya Tripathi: ఘనంగా వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్‌ రిసెప్షన్‌