తెల్లవారితే ఊరంతా పండుగ.. ఈలోపే బోరుమన్న గ్రామస్థులు..

దుర్గమ్మ పండుగకు సిద్ధం చేస్తున్న ఆ ఊరు బోరుమంది. విద్యుత్ షాక్‎కు గురై ముగ్గురు మృతి చెందగా మరోవ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాద సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్యతండాలో జరిగింది. కొంతమంది యువకులు దుర్గమ్మ పండుగకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో 11 కే.వీ విద్యుత్ వైర్ తెగి వారి మీద పడింది. ఓ బాలుడి‎తో సహా నలుగురు వ్యక్తులు విద్యుత్ షాక్‎కు గురయ్యారు. భూక్యా దేవేందర్, అనిల్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. రవి అనేవ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.

| Edited By: Srikar T

Updated on: Mar 05, 2024 | 12:46 PM

దుర్గమ్మ పండుగకు సిద్ధం చేస్తున్న ఆ ఊరు బోరుమంది. విద్యుత్ షాక్‎కు గురై ముగ్గురు మృతి చెందగా మరోవ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాద సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్యతండాలో జరిగింది. కొంతమంది యువకులు దుర్గమ్మ పండుగకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో 11 కే.వీ విద్యుత్ వైర్ తెగి వారి మీద పడింది. ఓ బాలుడి‎తో సహా నలుగురు వ్యక్తులు విద్యుత్ షాక్‎కు గురయ్యారు. భూక్యా దేవేందర్, అనిల్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. రవి అనేవ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.

జశ్వంత్ అనే బాలుడు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుర్గమ్మ పండుగ నేపథ్యంలో ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టెంట్ వేస్తున్న క్రమంలో టెంట్ కర్రలు 33/11 కేవి లైన్‎కు తగిలి తెగి పడటంతో ఈ విషాదం అలముకుంది. మృతులలో దేవేందర్ రాయపర్తి మండలం గట్టికల్లు గ్రామానికి చెందిన వాడు, అనీల్ తొర్రూరు మండలం జమస్తన్ పురంతండాకు చెందిన వాడుగా గుర్తించారు. ఊరంతా ఆర్తనాదాలతో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow us