విజయ్‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య టీవీఎస్ మోపెడ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నటుడు విజయ్ జోసెఫ్, రూ.600 కోట్ల ఆస్తులను ప్రకటించారు. ఆయన నామినేషన్ అఫిడవిట్‌లో రూ.404 కోట్లకు పైగా చరాస్తులు, రూ.220 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. పలు లగ్జరీ కార్లతో పాటు, రూ.1.20 కోట్ల బంగారం, రూ.15 లక్షల వెండి వివరాలను వెల్లడించారు. కోట్ల విలువైన వాహనాల జాబితాలో ఒక సాధారణ టీవీఎస్ ఎక్స్ఎల్ సూపర్ మోపెడ్ ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది, ఇది చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ చీఫ్ నటుడు విజయ్ జోసెఫ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. పెరంబూర్ స్థానానికి సోమవారం నామినేషన్ వేశారు. తనకు మొత్తం రూ.600 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్టు అఫిడ్‌విట్‌లో తెలిపారు. భార్య పేరున ఉన్న ఆస్తులను బయటపెట్టారు. తమిళనాడు ఎన్నికల బరిలో తొలిసారి దిగిన టీవీకే అధినేత విజయ్.. తన మొత్తం చరాస్తుల విలువ రూ. 404.58 కోట్లుగా ఎన్నికల కమిషన్‌కు స్పష్టం చేశారు. దాదాపు రూ. 220 కోట్ల మేర స్థిరాస్తులు ఉండగా, ఎలాంటి బ్యాంకు అప్పులు లేవని తెలిపారు. కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కార్లతో పాటు, ఆయన ఆస్తుల జాబితాలో ఒక సాధారణ టీవీఎస్ ఎక్స్ఎల్ సూపర్ మోపెడ్ ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఖరీదైన వాహనాల వివరాలను విజయ్ బయటపెట్టారు. తన దగ్గర BMW 530,BMW I7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్‌ఫైర్ వంటి కార్లు ఉన్నట్లు తెలిపారు. ఇంత ఖరీదైన కార్ల జాబితాలో ఒక సాధారణ మారుతీ సుజుకీ స్విఫ్ట్ కారు, టీవీఎస్ ఎక్స్‌ఎల్ (TVS XL Super) మోపెడ్ ఉండటం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఒక స్టార్ హీరో, పైగా ముఖ్యమంత్రి రేసులో ఉన్న నాయకుడి వద్ద ఇలాంటి సాధారణ వాహనం ఉండటం చర్చనీయాంశంగా మారింది.వాటి విలువ మొత్తం రూ.14.35 కోట్లుగా చెప్పారు. తన వద్ద సుమారు రూ.1.20 కోట్ల విలువ చేసే 883 గ్రాముల బంగారం, రూ.15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్టు చెప్పారు. ఇక, తన భార్య సంగీత పేరు మీద మాత్రం రూ.15 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. తనకు ఎలాంటి అప్పులు లేవని స్పష్టం చేశారు. వడ్డీ, ఆస్తులు, స్వయం ఉపాధి నుంచి వచ్చే వడ్డీ, ఆదాయాలను తన ప్రధాన ఆదాయ వనరులుగా తెలిపారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందే పార్టీని ప్రకటించిన విజయ్.. తన టార్గెట్ అసెంబ్లీ ఎన్నికలేనని అప్పట్లో ప్రకటించారు. ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనుండగా.. మే 4న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. తమిళనాడులోని 234 స్థానాలుకూ టీవీకే ఒంటరిగా పోటీ చేస్తోంది. తమిళనాడులో చతుర్ముఖ పోరు నెలకొంది. ప్రధాన పోటీ మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇరాన్ – ఇజ్రాయెల్ వార్‌లోకి కేఏ పాల్ ఎంట్రీ!
ఒక్క పాటతో రేంజ్ మారిపోతుందిగా.. వాట్ ఏ ప్లాన్
Peddi: అందర్నీ కార్నర్ చేస్తున్న రామ్ చరణ్
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
ఎన్ని గుండెలురా వీళ్లవి.! ఏకంగా పోలీసులతోనే ఫైట్‌కి దిగారు..
అమ్మవారి విగ్రహానికి చెమటలు.. పూనకాలతో ఊగిపోయిన భక్తులు
అద్భుతం.. రామాలయంలో హనుమంతుడు ప్రత్యక్షం
షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ దుకాణాలు బంద్

