Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sasikala Released: ఆదివారం జైలు నుంచి విడుదల కానున్న శశికళ.. తాజా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసిన ఆస్పత్రి వర్గాలు 

అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళ ఆదివారం విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలే స్వయంగా వెల్లడించాయి. అయితే ప్రస్తుతం ఆమె రోగ్యం కుదుటపడినప్పటికి...

Sasikala Released: ఆదివారం జైలు నుంచి విడుదల కానున్న శశికళ.. తాజా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసిన ఆస్పత్రి వర్గాలు 
sasikala
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 30, 2021 | 6:04 PM

అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళ ఆదివారం విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలే స్వయంగా వెల్లడించాయి. అయితే ప్రస్తుతం ఆమె రోగ్యం కుదుటపడినప్పటికి… మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచన మేరకు ఆమె బెంగుళూరులోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాతే చెన్నై వెళ్తారని తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో శశికళ చెన్నై వెళ్లే అవకాశం కనిపిస్తోంది. నాలుగేళ్ల జైలుశిక్షాకాలం పూర్తైన సమయంలో కరోనా లక్షణాలు కలిగి ఉండటంతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చేరారు.

ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకోవడంతో ఆదివారం విక్టోరియా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు. అటుపై ఆమె ఎక్కడ ఉండబోతున్నారనేది ప్రశ్న. కానీ.. ఆమె మేనల్లుడు ఇప్పటికే ఓ అపార్ట్‌మెంట్‌ను సిద్ధం చేశారని, శశికళకు కావల్సిన అన్ని ఏర్పాట్లూ అక్కడ ఉన్నాయంటున్నారు. శశికళ రాజకీయ జీవితంపై ఉత్కంఠ నెలకొంది. 2021 మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపధ్యంలో తమిళ రాజకీయాల్లో చిన్నమ్మ రీ ఎంట్రీ ఉంటుందా ? లేదా ? అనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. మరి ఆమె నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందో చూడాలి.

ఇక శిశికళ అస్వస్థతకు గురి కావడంతో అభిమానులు, నేతలు, మద్దతుదారులు ఒకింత ఆందోళకు గురయ్యారు. ఆమె జైలు నుంచి విడుదల కాగానే భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పరప్పణ అగ్రహారం జైలు నుంచి చెన్నై వరకు కనీసం వెయ్యి వాహనాలతో స్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్‌ మున్నేట్రకళగం అధినేత దినకరన్‌ బృందం ఏర్పాట్లు చేపట్టినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర రాజకీయాల్లో మార్పు చోటు చేసుకోనుందా..?

శశికళ జైలు నుంచి బయటకు రాగానే రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. అయితే చిన్నమ్మ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారా..? లేదా అనేదానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ఒక కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవించిన వారు ప్రత్యక్ష ఎన్నికల్లో నాలుగేళ్ల పాటు పోటీ చేసేందుకు అనర్హులు. దీంతో ఆమె ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. శశికళ జైలు నుంచి విడుదలయ్యాక అనుకున్నది సాధించేందుకు పట్టు బిగించినట్లు తెలుస్తోంది. అలాగే తన పంతాన్ని నెగ్గించుకునేందుకు శశికళ తిరిగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఏకంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో జట్టుకట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి చిన్నమ్మ విడుదలయ్యాక ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

ఇవి కూడా చదవండి :

Big Conspiracy : ఎర్రకోట పరిసరాల్లోకి నిరసనకారులు ఎలా వెళ్లారు…? అనుమతి ఎవరిచ్చారు..? ఆ దాడి ఓ కుట్ర..!

87 ఏళ్ల చరిత్రకు బ్రేక్ పడింది.. కరోనా మార్గదర్శకాల మధ్య రంజీ ట్రోఫీ నిర్వహించలేమన్న బీసీసీఐ