మరో సెన్సేషన్.. క్రిస్మస్ ఈవెంట్ విశిష్ట అతిథిగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..?
ఈ నెల 25ను క్రిస్మస్ వేడుకకు తెలుగు రాష్ట్రాలు సిద్దమవుతున్నాయి. అయితే ఏపీలో క్రిస్మిస్ పండుగ ముందస్తు వేడుకలు కాకరేపుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో డిసెంబర్ 21న జరగబోయే క్రిస్మస్ ఈవెంట్‌కు ఆత్మీయ విశిష్ట అతిథిగా టీడీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరుకాబోతున్నారంటూ ఉన్న ఓ ఇన్విటేషన్ కార్డ్ వైరల్ అవుతోంది. వైసీపీ ఉభయగోదావరి జిల్లాల సమన్వయ కర్త, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అని ఆ పత్రికలో పొందుపరచడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ ఇన్విటేషన్ […]

ఈ నెల 25ను క్రిస్మస్ వేడుకకు తెలుగు రాష్ట్రాలు సిద్దమవుతున్నాయి. అయితే ఏపీలో క్రిస్మిస్ పండుగ ముందస్తు వేడుకలు కాకరేపుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో డిసెంబర్ 21న జరగబోయే క్రిస్మస్ ఈవెంట్‌కు ఆత్మీయ విశిష్ట అతిథిగా టీడీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరుకాబోతున్నారంటూ ఉన్న ఓ ఇన్విటేషన్ కార్డ్ వైరల్ అవుతోంది. వైసీపీ ఉభయగోదావరి జిల్లాల సమన్వయ కర్త, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అని ఆ పత్రికలో పొందుపరచడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ ఇన్విటేషన్ కార్డు పైభాగంలో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు ప్రస్తుత ఏపీ సీఎం జగన్ ఫోటోలను కూడా పొందుపరిచారు.
కాగా ఈ కార్యక్రమంలో ప్రధాన ప్రసంగికులుగా రెవ.. జక్కల లాల్ బహదూర్ శాస్త్రి పేరును ముద్రించారు. ఇతడు క్రిస్టియన్ గాస్పల్ మినిస్ట్రీస్ చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. మొత్తం 21 మంది పేర్లు ఈ ఇన్విటేషన్ కార్డులో ఉండగా.. అందరి నేమ్స్‌కు చివర వైస్సార్‌సీపీ నాయకులనే ట్యాగ్స్ ఉండటం గమనార్హం. ఇదే గనుక నిజమయితే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చుట్టూ మరోసారి వివాదం ముసురుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.