మొన్న జగన్.. నేడు బి.ఎన్.రావు.. 3 రాజధానులు కన్‌ఫర్మ్

ఏపీ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ అభిమమతమే నెగ్గేలా కనిపిస్తోంది. మూడు రోజుల క్రితం అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనకు కొనసాగింపుగానే రాజధానిపై అధ్యయానికి నియమించిన బి.ఎన్.రావు కమిటీ నివేదిక సమర్పించింది. శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్‌కు నివేదిక సమర్పించిన బి.ఎన్.రావు కమిటీ సభ్యులు రిపోర్టులోకి కీలకాంశాలను మీడియాకు వెల్లడించారు. మూడు రాజధానులను కన్‌ఫర్మ్ చేస్తున్నట్లుగా పూర్తి వివరాలను వెల్లడించారు బి.ఎన్.రావు కమిటీ సభ్యులు. ప్రస్తుతమున్న అమరావతి-మంగళగిరి రాజధాని ఏరియాలో శాసనసభ, హైకోర్టు బెంచ్‌తోపాటు గవర్నర్ […]

మొన్న జగన్.. నేడు బి.ఎన్.రావు.. 3 రాజధానులు కన్‌ఫర్మ్
Follow us

|

Updated on: Dec 20, 2019 | 6:27 PM

ఏపీ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ అభిమమతమే నెగ్గేలా కనిపిస్తోంది. మూడు రోజుల క్రితం అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనకు కొనసాగింపుగానే రాజధానిపై అధ్యయానికి నియమించిన బి.ఎన్.రావు కమిటీ నివేదిక సమర్పించింది. శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్‌కు నివేదిక సమర్పించిన బి.ఎన్.రావు కమిటీ సభ్యులు రిపోర్టులోకి కీలకాంశాలను మీడియాకు వెల్లడించారు.

మూడు రాజధానులను కన్‌ఫర్మ్ చేస్తున్నట్లుగా పూర్తి వివరాలను వెల్లడించారు బి.ఎన్.రావు కమిటీ సభ్యులు. ప్రస్తుతమున్న అమరావతి-మంగళగిరి రాజధాని ఏరియాలో శాసనసభ, హైకోర్టు బెంచ్‌తోపాటు గవర్నర్ బంగ్లా అయిన రాజ్‌భవన్‌లను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు, సెక్రెటేరియట్, హైకోర్ట్ బెంచ్‌తోపాటు ప్రధాన విభాగాల అధిపతుల కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. ఒకప్పటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలులో పూర్తి స్థాయి హైకోర్టుతోపాటు హైకోర్టు అడ్మినిస్ట్రేషన్ వంటి అంశాలను ఏర్పాటు చేయాలని బి.ఎన్.రావు కమిటీ సూచన చేసింది. హైకోర్టుతోపాటు ఏపీకి కేటాయించే అన్ని ఎలైట్ కోర్టులు కర్నూలులోనే ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు కమిటీ సభ్యులు.

నివేదిక రూపకల్పన కోసం మొత్తం 13 జిల్లాల్లో దాదాపు 10వేల కిలోమీటర్లు ప్రయాణం చేశామని కమిటీ సభ్యులు తెలిపారు. మూడు ప్రధానాంశాలను అధ్యయనం చేశామని, ఏపీలో కొరవడిన రీజినల్ బ్యాలెన్స్‌ను సరిదిద్దేలా సూచనలు చేశామని వారన్నారు. రాజధానికి సంబంధించిన అంశాలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించడం ద్వారా ఏపీ సర్వతోముఖంగా, సమాన స్థాయిలో అభివృద్ధి చెందుతుందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన సూచనల్లో భాగంగా నాలుగు రీజినల్ డెవలప్‌మెంట్ బోర్డులను కర్నాటక రాష్ట్రం తరహాలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది బి.ఎన్.రావు కమిటీ. శ్రీకాకుళం, విజయనగరం; విశాఖపట్నం జిల్లాల్లో కలిపి ఉత్తరాంధ్ర అభివృద్ధి బోర్డు ఏర్పాటును ప్రతిపాదించారు. ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లాను కలిపి ఉత్తర కోస్తా అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో కలిపి దక్షిణ కోస్తా అభివృద్ధి బోర్డు, రాయలసీమలోని నాలుగు జిల్లాలలో కలిపి సీమ ప్రాంతీయ అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేయాలని నివేదికలో సూచించారు.

అమరావతికి వరద ప్రమాదం

అమరావతి ఏరియాలో ప్రతిపాదించిన రాజధాని ప్రాంతానికి కృష్ణా నది వరద ముప్పు వుందని బి.ఎన్.రావు కమిటీ అభిప్రాయపడింది. అయితే మంగళగిరి-అమరావతి ఏరియాలో ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజా ధనాన్ని ఖర్చు చేసినందున ఆ ప్రాంతంలో నిర్మాణమైన శాసనసభ, తదితర ఐకానిక్ కట్టడాల నిర్మాణాలను కొనసాగించాల్సి వుందన్నారు కమిటీ సభ్యులు. అయితే, ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న ఏరియా కంటే నాగార్జున యూనివర్సిటీ వున్న ప్రాంతమైతే ఐకానిక్ భవనాల నిర్మాణాలకు బావుంటుందని కమిటీ సూచించింది. నాగార్జున యూనివర్సిటీ ఏరియాలో రాజ్‌భవన్, శాసనసభ, శాసనమండలి, హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. అందుకోసం భవ్యమైన నిర్మాణాలు చేపట్టాలని కమిటీ ప్రతిపాదించింది.