Viral Video: దైవదర్శనానికి పెద్దపులి ఎదురు వచ్చింది.. చుట్టూ ఎవరూ లేరు.. ఆ తర్వాత
యువకులు దైవదర్శనం కోసం వాళ్లు టైగర్ రిజర్వ్ లోకి వెళ్లారు. కాని అనుకోకుండా వాళ్లకు పెద్దపులి ఎదురయ్యింది. అప్పుడు వారు ఏం చేశారంటే..?
-పులిని చూసి చెట్టెక్కిన యువకులు -మధ్యప్రదేశ్ లోని పన్నా రిజర్వ్‌లో ఘటన -సోషల్ మీడియాలో వీడియో వైరల్
Shocking Video: దైవదర్శనం కోసం వాళ్లు టైగర్ రిజర్వ్ లోకి వెళ్లారు. కాని అనుకోకుండా వాళ్లకు పెద్దపులి ఎదురయ్యింది. ప్రాణభయంతో వణికిపోయారు. బైక్‌పై వచ్చిన వాళ్లు చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. చెట్టు కింద పులి , చెట్టు మీద ఇద్దరు యువకులు ఈ వీడియో సోషల్ మీడియా(Social Media)లో తెగ వైరల్ అయ్యింది. సంచలనం రేపిన ఈ ఘటన మధ్యప్రదేశ్( madhya pradesh)లోని చాతర్‌పూర్‌లో జరిగింది. పన్నా టైగర్ రిజర్వ్ లోని ఆలయాన్ని సందర్శించేందుకు ఏడాదిలో ఒకేసారి అనుమతిస్తారు. ఆ యువకులు దైవదర్శనం కోసం టైగర్ రిజర్వ్ లోకి వెళ్లారు. అదే సమయంలో దారిలో పులి ఎదురుకావడంతో వాళ్లు చెట్టు ఎక్కారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ఆ ఇద్దరు యువకులను కాపాడారు. దీంతో బ్రతుకు జీవుడా అంటూ ఆ యువకులు అక్కడ నుంచి జారుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు గుడికి వెళ్లకముందే దేవుడు కనిపించాడుగా అని కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: పసికందును చంపి ఉరేసుకున్న తల్లి..! పోలీసులు సైతం కన్నీరు.. కానీ చివరి నిమిషంలో
డాక్టర్‌కి కాల్‌చేసి జాబ్ అడిగిన ఐఏఎస్..! ఆరా తీస్తే అసలు బాగోతం తెలిసింది