Viral Video: డ్యాన్సులందు ఈ డ్యాన్స్ వేరయా.. ఇలాంటి నృత్యం మీరెప్పుడూ చూసుండరు.. సోషల్ మీడియాలో వైరల్
సోషల్ మీడియాలో (Social Media) డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు చాలానే ఉన్నాయి. ట్రెండ్ అవుతున్న పాటలకు స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేసే వీడియోలు కోకొల్లలు. వీటిలో పలు వీడియోలు అప్పటి పరిస్థితులను బట్టి వైరల్...

సోషల్ మీడియాలో (Social Media) డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు చాలానే ఉన్నాయి. ట్రెండ్ అవుతున్న పాటలకు స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేసే వీడియోలు కోకొల్లలు. వీటిలో పలు వీడియోలు అప్పటి పరిస్థితులను బట్టి వైరల్ అవుతుంటాయి. ఆశ్చర్యకరమైన వీడియోలు మనల్ని ఔరా అనిపిస్తాయి. ప్రస్తుతం అలాంటి డ్యాన్స్ (Dance Video) కు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ డ్యాన్స్ ను ఆ యువకుడు ఎలా చేశాడని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో ఆ వ్యక్తి తన చేతులపై నిలబడి, కాళ్లతో అద్భుతమైన డ్యాన్స్ చేస్తాడు. చాలా మంది వ్యక్తులు తమ చేతులపై నిలబడి నడవడం చూసే ఉంటారు. కానీ హ్యాండ్‌స్టాండ్ చేస్తున్నప్పుడు డ్యాన్స్ చేయడాన్ని మీరు చూశారా.. చూడకపోతే, ఇప్పుడు చూడండి. ఈ వీడియో చూస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఈ క్లిప్ లో వ్యక్తి తన చేతులపై నిలబడతాడు. కాళ్లు పైకి లేపి బ్యాలెన్సింగ్ చేసుకుంటాడు. ఇక కాళ్లు ఊపుతూ డ్యాన్స్ చేస్తాడు. మ్యూజిక్ కు తగ్గట్టుగా చిందులేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది.




ఈ
View this post on Instagram
అద్భుతమైన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. ఆగస్టు 7న షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 3.5 లక్షల మంది వీక్షించారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇది చూసి నా శరీరంలో డ్యాన్స్ చేయాలనే ఉత్సాహం మొదలైందని, ఇది రామ్‌దేవ్ బాబాకు సవాలుగా మారిందని మరో వ్యక్తి తమ భావాలను పంచుకుంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..