
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు పొందిన బ్రెజిలియన్ సన్యాసిని సిస్టర్ ఇనా కెనాబారో లూకాస్ కన్నుమూశారు. 116 సంవత్సరాల వయసులో సిస్టర్ ఇనా కెనాబారో లూకాస్ మరణించినట్టుగా అక్కడి అధికారులు వెల్లడించారు. కెనబారో 1908 జూన్ 8న బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో సుల్‌లో జన్మించారు. ఇనా కెనబారో లూకాస్ తన 20ల ప్రారంభంలో కాథలిక్ సన్యాసిని అయ్యారు. ఆమె 117 పుట్టినరోజుకు కేవలం నెల రోజుల ముందు కన్నుమూశారు.
వృద్ధాప్య సమస్యలతో అనారోగ్యానికి గురైన కాసెరోస్‌లోని శాంటా కాసా డి మిసెరికార్డియా ఆసుప్రతిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం నన్‌గానే ఉన్నారు. కెనబారోకు ఫుట్‌బాల్ ఆట అంటే ఎంతో ఇష్టమని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా, ప్రపంచంలోనే జీవించి ఉన్న అత్యంత వృద్ధురాలు అనే గుర్తింపు ఇప్పుడు ఇంగ్లాండ్‌లోని సర్రేకు చెందిన 115 ఏళ్ల ఎథెల్ కాటర్‌హామ్‌కు చేరనుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..