ఆ దేశంలో ఒంటరిగా జీవించాలంటే పన్ను చెల్లించాల్సిందే.. బ్యాచిలర్ ట్యాక్స్ వసూలు ఎక్కడంటే

|

Jul 23, 2024 | 6:44 PM

ప్రపంచంలో వింత పన్నులపై ప్రజల దృష్టి పటింది. అలాంటి పన్నుల్లో ఒకటి ఒంటరిగా జీవించే వ్యక్తులు పన్నులు చెల్లించడం.. అంటే బ్యాచలర్ వ్యక్తులు కూడా పన్ను చెల్లించాల్సిన దేశం ఉందని.. దీనిని 'బ్యాచిలర్ ట్యాక్స్' అని పిలుస్తారని తెలుసా.. ఆ దేశం ఎక్కడ ఉంది? ఎప్పటి నుంచి ఈ ట్యాక్స్ మొదలైంది. ఎవరు చెల్లించాలో తెలుసుకుందాం.. ప్రపంచంలో చాలా మంది తమకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అందుకే జీవితాంతం ఒంటిరిగా బతికేస్తాం అని చెబుతారు. అయితే US రాష్ట్రం మిస్సోరిలో నివసించే ఏ వ్యక్తి బ్రహ్మచారి జీవించాలని అనుకోరు.

ఆ దేశంలో ఒంటరిగా జీవించాలంటే పన్ను చెల్లించాల్సిందే.. బ్యాచిలర్ ట్యాక్స్ వసూలు ఎక్కడంటే
Weird Taxes
Follow us on

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు సాధారణ బడ్జెట్ శ్రామిక ప్రజలకు కొంత మేర ఉపశమనం కలిగించడంతో పాటు కొంతమందికి ప్రజల టెన్షన్‌ను కూడా పెంచుతుంది. ఇప్పుడు సంవత్సరానికి రూ. 3 లక్షలు సంపాదించే వ్యక్తులు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.. అయితే వార్షిక ఆదాయం రూ. 3 లక్షల నుండి రూ. 7 లక్షల మధ్య ఉంటే 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఆదాయం రూ. 10 నుండి 12 లక్షలు అయితే 15 శాతం పన్ను చెల్లించాలి. ఈ నేపధ్యంలో ప్రపంచంలో వింత పన్నులపై ప్రజల దృష్టి పటింది. అలాంటి పన్నుల్లో ఒకటి ఒంటరిగా జీవించే వ్యక్తులు పన్నులు చెల్లించడం.. అంటే బ్యాచలర్ వ్యక్తులు కూడా పన్ను చెల్లించాల్సిన దేశం ఉందని.. దీనిని ‘బ్యాచిలర్ ట్యాక్స్’ అని పిలుస్తారని తెలుసా.. ఆ దేశం ఎక్కడ ఉంది? ఎప్పటి నుంచి ఈ ట్యాక్స్ మొదలైంది. ఎవరు చెల్లించాలో తెలుసుకుందాం..

ప్రపంచంలో చాలా మంది తమకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అందుకే జీవితాంతం ఒంటిరిగా బతికేస్తాం అని చెబుతారు. అయితే US రాష్ట్రం మిస్సోరిలో నివసించే ఏ వ్యక్తి బ్రహ్మచారి జీవించాలని అనుకోరు. ఎందుకంటే ఇక్కడ నివసించే బ్యాచిలర్లు కూడా పన్నులు చెల్లించాలి. ఈ విచిత్రమైన బ్యాచిలర్‌ పన్ను మొట్టమొదట 203 సంవత్సరాల క్రితం అంటే 1820 సంవత్సరంలో విధించబడింది. అప్పటి నుంచి ఈ బ్యాచిలర్‌ పన్ను విధించడం కొనసాగుతూనే ఉంది. మీడియా నివేదికల ప్రకారం, 21 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అవివాహితులు ప్రతి సంవత్సరం ఒక డాలర్ అంటే దాదాపు రూ. 83ల పన్ను చెల్లించాలి.

ఈ పన్ను గతంలో ఈ దేశాల్లో కూడా ఉండేది

అయితే ఈ బ్యాచిలర్‌ పన్ను ఇప్పుడు ఒక్క మిస్సోరిలో కొనసాగుతున్నా గతంలో జర్మనీ, ఇటలీ, దక్షిణాఫ్రికా వంటి దేశాలతో సహా అనేక ఇతర దేశాలలో అమలు చేశారు. వీటిలో చాలా దేశాలలో ఈ పన్నును రద్దు చేశారు. అయితే ఇంతకుముందు ప్రజలపై విధించిన ఇలాంటి వింత పన్నులు చాలా ఉన్నాయని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్య పడాల్సిందే. అయితే ఆ పన్నులను కాలక్రమంలో రద్దు చేశారు.

ఇవి కూడా చదవండి

టోపీ పై పన్ను

చాలా కాలం క్రితం ప్రజలు ‘టోపీ పన్ను’ కూడా చెల్లించేవారు. ఈ పన్నును 1784 నుంచి 1811 మధ్య బ్రిటిష్ ప్రభుత్వం పురుషులపై విధించింది. దీని వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, చాలా ఖరీదైన టోపీలను కలిగి ఉన్న వ్యక్తులు ధనవంతులుగా పరిగణించబడేవారు. పేద వారు టోపీని కొనగలిగే ఆర్ధిక శక్తిని కలిగి ఉండరు అని భావించేవారు. అందువల్ల ధనికులు ధరించే టోపీల ఆధారంగా వారి సంపదను లెక్కించి పన్ను వసూలు చేసేవారు.

టాయిలెట్ ఫ్లష్ పన్ను

అమెరికాలోని మేరీల్యాండ్‌లో టాయిలెట్లను ఫ్లష్ చేయడంపై కూడా పన్ను విధించారు. నీటి వినియోగాన్ని నియంత్రించడానికి ఈ పన్నును అమలు చేశారు. ఇక్కడ, ప్రతి నెలా 5 డాలర్లు అంటే సుమారు రూ.418 ప్రజల నుండి టాయిలెట్ ఫ్లషింగ్ పన్నుగా వసూలు చేస్తారు. ఆ డబ్బులను మురుగునీటి వ్యవస్థ అభివృద్ధికి ఉపయోగిస్తారు.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..